Share News

Murugan: 11 ఏళ్ళలో భారీగా తగ్గిన తీవ్ర పేదరికం

ABN , Publish Date - Jun 10 , 2025 | 10:23 AM

కేంద్రంలో మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక పేదరిక నిర్మూలనలో ఫలితాలు కనిపిస్తున్నాయని, ఈ 11 ఏళ్ళలో సుమారు 27 కోట్లమంది తీవ్ర పేదరికం నుండి విముక్తులయ్యారని కేంద్రమంత్రి ఎల్‌.మురుగన్‌ పేర్కొన్నారు.

Murugan: 11 ఏళ్ళలో భారీగా తగ్గిన తీవ్ర పేదరికం

- పుదుచ్చేరిలో కేంద్రమంత్రి ఎల్‌.మురుగన్‌

పుదుచ్చేరి: కేంద్రంలో మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక పేదరిక నిర్మూలనలో ఫలితాలు కనిపిస్తున్నాయని, ఈ 11 ఏళ్ళలో సుమారు 27 కోట్లమంది తీవ్ర పేదరికం నుండి విముక్తులయ్యారని కేంద్రమంత్రి ఎల్‌.మురుగన్‌(Union Minister L. Murugan) పేర్కొన్నారు. కేంద్రపాలిత రాష్ట్రమైన పుదుచ్చేరి అసెంబ్లీని కాగిత రహితంగా మార్చే జాతీయ ‘ఈ-థాన్‌’ యాప్‌ ప్రారంభోత్సవం సోమవారం ఆ రాష్ట్రముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి అధ్యక్షతన జరిగింది.


ఈ కార్యక్రమాకిఇ ముఖ్యఅతిథిగా హాజరై కేంద్రమంత్రి మురుగన్‌ మీడియాతో మాట్లాడుతూ, దేశప్రజల అండదండలతో కేంద్రంలో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ 12వ సంవత్సరంలోకి విజయవంతంగా అడుగుపెట్టారన్నారు. భారత్‌ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కూడా వరుసగా మూడుసార్లు ఆ పదవిలో కొనసాగలేదన్నారు. భారతదేశం ఈ 11 సంవత్సరాల్లో 270 మిలియన్ల మందిని దారిద్య్రరేఖకు ఎగువన పెంచినట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించిందని,


nani1.2.jpg

ప్రపంచంలో డిజిటల్‌ పద్ధతిలో నగదు బట్వాడ చేసే దేశాల్లో భారత్‌ను ద్వితీయ స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ నిలిపారని ఆయన పేర్కొన్నారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా(Amit Shah) తమిళనాడులో రెండ్రోజులు పర్యటించడంతో డీఎంకే పాలకులు ఆందోళన చెందుతున్నారని త్వరలోనే టాస్మాక్‌ అవినీతి గుట్టురట్టవుతుందని మురుగన్‌ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన ధరలు

నిన్ను ఏమడిగారు.. నేనేం చెప్పాలి

Read Latest Telangana News and National News

Updated Date - Jun 10 , 2025 | 10:23 AM