Swadeshi 4G: స్వదేశీ 4జీ లాంఛ్ చేసిన ప్రధాని మోదీ.. అంతర్జాతీయ స్థాయిలో మరో అడుగు ముందుకు..
ABN , Publish Date - Sep 27 , 2025 | 05:38 PM
అంతర్జాతీయ టెలికాం విపణిలోని ప్రతిష్టాత్మక లీగ్‌లోకి భారత్ కూడా ప్రవేశించింది. బీఎస్‌ఎన్‌ఎల్ స్వదేశీ 4జీ స్టాక్‌ను శనివారం ప్రధాని మోదీ ఆవిష్కరించారు. టెలికాం రంగంలో ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
అంతర్జాతీయ టెలికాం విపణిలోని ప్రతిష్టాత్మక లీగ్‌లోకి భారత్ కూడా ప్రవేశించింది. బీఎస్‌ఎన్‌ఎల్ స్వదేశీ 4జీ స్టాక్‌ను శనివారం ప్రధాని మోదీ ఆవిష్కరించారు. టెలికాం రంగంలో ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుత ఒడిశా పర్యటనలో ఉన్న ప్రధాని సుమారు రూ.60,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు (India 4G network launch).
వీటిలో అత్యంత కీలకమైనది స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన బీఎస్ఎన్ఎల్ 4జీ స్టాక్ ఆవిష్కరణ (indigenous telecom India). దాదాపు రూ. 37,000 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా నిర్మించిన 97,500కు పైగా 4జీ మొబైల్ టవర్లను ఆయన జాతికి అంకితం చేశారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ టవర్లు మారుమూల, సరిహద్దు, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లోని 2.2 కోట్ల మంది భారతీయులకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తాయి. ఈ నెట్‌వర్క్ క్లౌడ్ ఆధారితమైనదని, భవిష్యత్తులో 5జీకి సులభంగా అప్‌గ్రేడ్ చేయవచ్చని అధికారులు తెలిపారు (Indian 4G technology).
ఈ ఆవిష్కరణతో.. టెలికాం పరికరాలను తయారు చేసే డెన్మార్క్, స్వీడన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాల సరసన భారతదేశం నిలిచింది (India joins global tech leaders). ఈ టవర్లు పూర్తిగా సౌరశక్తితో నడుస్తాయి. వీటిని భారతదేశంలోని అతిపెద్ద గ్రీన్ టెలికాం సర్వీస్‌గా పిలుస్తున్నారు. కాగా, ప్రస్తుత ఒడిశా పర్యటనలో ప్రధాని మోదీ ఆ రాష్ట్రానికి పలు అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారు.
ఇవి కూడా చదవండి..
చిరుత పవర్ చూశారా? నీటిలోకి దూకి మొసలిని ఏం చేసిందో చూడండి..
ఈ ఫొటోలో చిలుక మాత్రమే కాదు.. బాటిల్ కూడా ఉంది.. 6 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..