Share News

Cheetah vs crocodile: చిరుత పవర్ చూశారా? నీటిలోకి దూకి మొసలిని ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - Sep 27 , 2025 | 03:16 PM

సాధారణంగా నీటిలోని మొసలి అత్యంత బలమైన జంతువు. నీటిలోని మొసలి జోలికి వెళితే ఎంతటి పెద్ద జంతువైనా ప్రాణాల మీద ఆశలు కోల్పోవాల్సిందే. నీటిలోని మొసలి జోలికి సాధారణంగా ఎంత క్రూరమృగమైనా వెళ్లదు.

Cheetah vs crocodile: చిరుత పవర్ చూశారా? నీటిలోకి దూకి మొసలిని ఏం చేసిందో చూడండి..
Cheetah vs crocodile

సాధారణంగా నీటిలోని మొసలి అత్యంత బలమైన జంతువు. నీటిలోని మొసలి జోలికి వెళితే ఎంతటి పెద్ద జంతువైనా ప్రాణాల మీద ఆశలు కోల్పోవాల్సిందే. నీటిలోని మొసలి జోలికి సాధారణంగా అడవికి రాజైన సింహం కూడా వెళ్లదు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ వీడియోలో ఓ చిరుత పులి.. నీటలోకి దూకి మరీ మొసలిని వేటాడింది ( cheetah attack).


@ailton_lara అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు (wild animal fight). వైరల్ అవుతున్న ఆ వీడియోను జంగిల్ సఫారీ టూరిస్ట్‌లు చిత్రీకరించారు. ఈ వీడియోలో ఒక చిరుత చెట్టుపై కూర్చొని ఉంది. ఒక మొసలి పక్కనే ఉన్న నదిలో ఈదుతూ ఉంది. సాధారణంగా నీటిలో ఉన్న మొసలి జోలికి సింహం కూడా వెళ్లదు. అయితే ఆ చిరుత చెట్టు మీద నుంచి నేరుగా నదిలోకి దూకేసింది. ఆ మొసలి మెడ పట్టేసుకుంది. మొసలి పోరాడేందుకు ఎలాంటి అవకాశమూ ఇవ్వకుండా బయటకు తీసుకొచ్చేసింది.


అంత మొసలిని పట్టుకుని కూడా గట్టు సునాయాసంగా ఎక్కేసింది (shocking animal video). ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.3 కోట్ల మందికి పైగా వీక్షించారు. 8 లక్షల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. చిరుతలు సాధారణంగా మొసళ్లను వేటాడవని ఒకరు కామెంట్ చేశారు. ఆకలి ప్రాణాలకు తెగించేలా చేస్తుందని ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతోందని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఆకుల మధ్యలో కప్ప.. 6 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లకు తిరుగులేనట్టే..

షాకింగ్ సీన్.. చూస్తుండగానే రోడ్డు ఎలా కూలిపోయిందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 27 , 2025 | 03:17 PM