Share News

US on H1 B Visa Restrictions: అమెరికాతో సంప్రదిస్తున్నాం

ABN , Publish Date - Sep 21 , 2025 | 06:20 AM

హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్‌ ప్రభుత్వం తాజాగా విధించిన ఆంక్షలతో అనేక కుటుంబాల మీద ప్రభావం పడుతుందని విదేశాంగశాఖ ఆందోళన వ్యక్తం చేసింది...

 US on H1 B Visa Restrictions: అమెరికాతో సంప్రదిస్తున్నాం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్‌ ప్రభుత్వం తాజాగా విధించిన ఆంక్షలతో అనేక కుటుంబాల మీద ప్రభావం పడుతుందని విదేశాంగశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యపై అమెరికా అధికారులు దృష్టి పెడతారని ఆశిస్తున్నామని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ తెలిపారు. ట్రంప్‌ నిర్ణయం కలిగించే ప్రభావంపై అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని, భారత పరిశ్రమలు తదితర భాగస్వామ్యపక్షాలను కూడా సంప్రదిస్తున్నామని వెల్లడించారు. కాగా.. ముందుకెళ్లే మార్గంపై అమెరికా ప్రభుత్వంతో, ఐటీ పరిశ్రమకు చెందిన ప్రతినిధులతో చర్చలు కొనసాగుతున్నాయని కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఈ వార్తలు కూడా చదవండి

ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు

మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 21 , 2025 | 06:28 AM