India- China Ties: సరిహద్దు వివాదం.. కీలక నిర్ణయం: భారత్‌లో చైనా రాయబారి
ABN , Publish Date - Aug 22 , 2025 | 10:57 AM
భారత్‌తో తనకున్న సరిహద్దు వివాదాలను పరిష్కరించే దిశగా చైనా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా భారత్‌లో చైనా రాయబారి జు ఫీహాంగ్ గురువారం న్యూఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 22 : భారత్‌తో తనకున్న సరిహద్దు వివాదాలను పరిష్కరించే దిశగా చైనా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా భారత్‌లో చైనా రాయబారి జు ఫీహాంగ్ గురువారం న్యూఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇరు దేశాలు ఈ బృందాలను ఏర్పాటు చేయనున్నాయని పేర్కొన్నారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత్‌లో పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య 10 అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. వీటిలో ఒక బృందం డీలిమిటేషన్ ప్రక్రియ చేస్తుందని వివరించారు. మరో బృందం.. సరిహద్దుతోపాటు ఆ ప్రాంతాల నిర్వహణపై దృష్టి సారిస్తోందని తెలిపారు.
అంతకు ముందు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సరిహద్దు సమస్యపై చర్చల జరిగాయన్నారు. అలాగే ఇరు దేశాల సరిహద్దు ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి లిపులేఖ్, షిప్కిలాతోపాటు నాథులా మార్గాలను తిరిగి తెరిచేందుకు అంగీకారం తెలిపాయని చెప్పారు.
ఇక భారత్, చైనాల మధ్య సంబంధాలను సరిహద్దు సమస్యగా నిర్వచించకూడదని చైనా రాయబారి జు ఫీహాంగ్ అభిప్రాయ పడ్డారు. సరిహద్దు సమస్య ఒక వైపు ఉంటే.. భారత్, చైనా మధ్య సహకారం మరోవైపు ఉందన్నారు. షాంగై కో ఆపరేటివ్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కావడం ద్వారా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు మరింత దృఢమవుతాయని భారత్‌లో చైనా రాయబారి జు ఫీహాంగ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆగస్టు 31వ తేదీన చైనాలోని టియాంజిన్ నగరంలో ఎస్‌సీవో సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. చైనాలో ప్రధాని మోదీ పర్యటన విజయవంతం చేయడానికి ఇప్పటికే ఇరు దేశాలకు చెందిన పలు బృందాలు తీవ్ర ఆసక్తితో పని చేస్తున్నాయి. దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ మరికొద్ది రోజుల్లో చైనాలో పర్యటించున్న వేళ.. ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యి.. భారత్‌లో ఇటీవల రెండు రోజులపాటు పర్యటించిన విషయం విదితమే.
ఇవి కూడా చదవండి
సరిహద్దు వివాదం.. కీలక నిర్ణయం: భారత్‌లో చైనా రాయబారి
గోదావరి - కావేరి అనుసంధానంపై కీలక భేటీ
For More National News And Telugu News