Share News

India Air Force: పాక్‌ సరిహద్దుల్లో వార్‌ గేమ్‌

ABN , Publish Date - May 07 , 2025 | 05:42 AM

భారత వాయుసేన పాక్‌ సరిహద్దుల్లో వచ్చే వార్‌ గేమ్‌కు సిద్ధమైంది. రాజస్థాన్‌లో రెండు రోజులపాటు డ్రిల్‌లు నిర్వహించనున్నారు

India Air Force: పాక్‌ సరిహద్దుల్లో వార్‌ గేమ్‌

న్యూఢిల్లీ, మే 6: పాక్‌తో ఉద్రిక్తతలు ముదురుతున్న నేపథ్యంలో సరిహద్దుల్లో భారీ స్థాయిలో వార్‌ గేమ్‌కు భారత వాయుసేన సిద్ధమైంది. బుధ, గురువారాల్లో రెండు రోజులపాటు రాజస్థాన్‌లో అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో డ్రిల్‌ నిర్వహించేందుకు సిద్ధమైంది. బుధవారం రాత్రి 9.30 గంటలకు ఈ విన్యాసాలు ప్రారంభమై శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ముగియనున్నాయి. భారత వైమానిక దళం యుద్ధ సన్నద్ధత పూర్తిస్థాయిలో పరీక్షించనున్నామని.. వేగంగా స్పందించడం, అత్యవసర పరిస్థితుల్లో సమన్వయం, రాత్రిపూట, పగటి సమయంలో ఎలా వ్యవహరించాలి వంటి అంశాలను పరిశీలించనున్నామని వాయుసేన వర్గాలు తెలిపాయి.

Updated Date - May 07 , 2025 | 05:42 AM