IFS Officer Suicide: భవనంపై నుంచి దూకి ఐఎఫ్ఎస్ అధికారి సూసైడ్
ABN , Publish Date - Mar 07 , 2025 | 05:01 PM
ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది ఆత్మహత్యా ఘటనగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఎలాంటి సూసైట్ నోట్ లభించలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు

న్యూఢిల్లీ: ఇండియన్ ఫారెస్ సర్వీసు (IFS) అధికారి ఒకరు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంచలనమైంది. సెంట్రల్ ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని విదేశాంగ శాఖకు చెందిన అధికారి జితేంద్ర రావత్ (42)గా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది ఆత్మహత్యా ఘటనగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఎలాంటి సూసైట్ నోట్ లభించలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
Supreme Court: ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్టు నిలిపివేతకు సుప్రీంకోర్టు 'నో'
సంఘటన వివరాల ప్రకారం, విదేశాంగ శాఖకు చెందిన రెసిడెన్షియల్ సొసైటీలోని నాలుగో అంతస్తు భవనంలో రావత్ తన తల్లితో పాటు ఉంటున్నారు. ఆయన భార్యాపిల్లలు డెహ్రాడూన్ వెళ్లారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో తమకు సమాచారం అందడంతో ఘనటా స్థలికి చేరుకున్నామని, డిప్రెషన్ కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తు్న్నామని అధికారులు చెప్పారు.
కాగా, విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో రావత్ మృతిని ధ్రువీకరించింది. ఈ క్లిష్ట సమయలో ఆయన కుటుంబానికి అన్నిరకాలుగా సాయం అందిస్తామని, కేసు విచారణలో ఢిల్లీ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. బాధిత కుటుంబ గోప్యత దృష్ట్యా మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించింది.
ఇవి కూడా చదవండి
Bihar Assembly Polls 2025: నిన్న, నేడు, రేపు కూడా ఆయనే సీఎం
Ranya Rao questioned by Police: నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు.. విచారణలో బయటపడ్డ కీలక విషయాలు
భారత్‌కు అప్పగించొద్దు.. చిత్రవధ చేస్తారు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.