Share News

Husband Blackmails Wife: భార్య స్నానం చేస్తుండగా వీడియోలు తీసి..

ABN , Publish Date - Jul 24 , 2025 | 03:51 AM

ప్రభుత్వ ఉద్యోగిని అయిన 31ఏళ్ల వివాహిత తన భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Husband Blackmails Wife: భార్య స్నానం చేస్తుండగా వీడియోలు తీసి..

  • డబ్బులివ్వకపోతే ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరించి

  • ఓ భర్త దుర్మార్గం.. మహారాష్ట్రలో ఘటన

ముంబై, జూలై 23: ప్రభుత్వ ఉద్యోగిని అయిన 31ఏళ్ల వివాహిత తన భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. పడక గదిలో, బాత్‌రూంలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి అభ్యంతరకర రీతిలో తన కదలికలను చిత్రీకరించాడని ఆరోపించింది. బాధితురాలిది మహారాష్ట్ర. ఆమె భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగే. ఆయన తనపై వరకట్న వేధింపులకు పాల్పడుతున్నాడనీ ఆమె ఫిర్యాదులో ఆరోపించింది. కారుకు సంబంధించిన వాయిదాలు కట్టేందుకు పుట్టింటికి వెళ్లి రూ.1.5 లక్షలు తేవాలంటూ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించింది. డబ్బు తీసుకురాకుంటే తాను చిత్రీకరించిన దృశ్యాలను ఆన్‌లైన్‌లో పెడతానంటూ బెదిరిస్తున్నాడని, భర్త దుశ్చేష్టలకు అతడి కుటుంబసభ్యులు మద్దతు పలుకుతున్నారని పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె భర్త, అత్త, ముగ్గురు ఆడపడచులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Updated Date - Jul 24 , 2025 | 03:51 AM