Share News

Indian Family: భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష

ABN , Publish Date - May 29 , 2025 | 01:53 PM

భారతీయుల మృతికి కారణమైన ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ వెల్లడించింది. ఒకరికి 10 ఏళ్లు, మరొకరికి 6 ఏళ్లు జైలు శిక్ష విధించినట్లు చెప్పింది.

Indian Family: భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష

వాషింగ్టన్, మే 29: మనుషుల అక్రమ రవాణా చేసే క్రమంలో నలుగురు భారతీయుల మరణానికి కారణమైన ఇద్దరికి జైలు శిక్ష ఖరారు చేసినట్లు యూఎస్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ స్పష్టం చేసింది. ఈ కేసులో హర్షకుమార్ రమణ్‌లాల్ పటేల్‌కు 10 ఏళ్లు, స్టీవ్ ఆంథోనీ షాండ్‌కి ఆరు ఏళ్లు జైలు శిక్ష విధించినట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ జస్టిస్ వెల్లడించింది. భారత్ నుంచి కెనడాకు స్టూడెంట్ వీసాలపై భారతీయులను తీసుకువచ్చి.. అటు నుంచి వారిని అమెరికాకు అక్రమంగా వీరిద్దరు తరలించారని డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ నిర్ధారించింది. ఈ నలుగురు మృతుల్లో మూడేళ్ల చిన్నారితోపాటు 11 ఏళ్ల బాలికా ఉందని తెలిపింది.

2022, జనవరిలో హర్షకుమార్, స్టీవ్ ఆంథోనిలు.. కెనడా నుంచి 11 మంది భారతీయులను అక్రమంగా అమెరికాకు తరలించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వాతావరణం ఏ మాత్రం అనుకూలించ లేదు. భారీ మంచు తుఫాన్ వచ్చింది. అందులో చిక్కుకుని ఈ నలుగురు భారతీయులు మరణించారు.


అయితే వీరు యూఎస్‌కు అక్రమ మార్గంలో తరలివస్తున్న సమయంలో మిన్నెసోటా మంచులో వ్యాన్ చిక్కుకుంది. దీనిని యూఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్ గుర్తించారు. కానీ అందులో ఎవరు ప్రయాణం చేయడం లేదంటూ వారికి స్టీవ్ సమాధానమిచ్చాడు. అదే సమయంలో ఇంతలో మరో ఐదుగురు వ్యక్తులు పంట పొలాల ప్రాంతం నుంచి బయటకు వచ్చారు. వారిలో ఒకరు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో.. అత్యవసర పరిస్థితుల్లో అతడిని విమానంలో ఆసుపత్రికి తరలించారు.


అదే సమయంలో ఇద్దరు వలసదారులతోపాటు స్టీవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలను రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు గుర్తించారు. ఈ మృతదేహాలు మంచుతో కప్పబడిపోయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో హర్షకుమార్, స్టీవ్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో వీరిద్దరి పాత్రపై విచారణ జరిపి శిక్ష ఖరారు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..

రేషన్ షాపుల ద్వారానే నిత్యవసర వస్తువుల పంపిణీ.. ఎందుకంటే..

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 29 , 2025 | 03:06 PM