HUL Announces Price Cuts: సబ్బులు షాంపూ ధరలు తగ్గిస్తున్నాం
ABN , Publish Date - Sep 14 , 2025 | 06:17 AM
జీఎస్టీ తగ్గింపు ఫలితాలను ప్రజలకు అందించే దిశగా కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. జీఎస్టీ తగ్గింపుతో గరిష్ఠ అమ్మకపు ధర(ఎంఆర్‌పీ)లో వచ్చిన మార్పులను వినియోగదారులకు తెలిసేటట్లు...
పేస్టు, జామ్, హార్లిక్స్, బూస్ట్, బ్రూ కాఫీ కూడా...
22 నుంచి కొత్త తగ్గింపు ధరలు: హెచ్‌యూఎల్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: జీఎస్టీ తగ్గింపు ఫలితాలను ప్రజలకు అందించే దిశగా కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. జీఎస్టీ తగ్గింపుతో గరిష్ఠ అమ్మకపు ధర(ఎంఆర్‌పీ)లో వచ్చిన మార్పులను వినియోగదారులకు తెలిసేటట్లు ప్రతి కంపెనీ కనీసం రెండు పత్రికలలో ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మార్కెట్‌లో మిగిలిన స్టాక్‌పై తగ్గిన కొత్త ఎంఆర్‌పీ ధరలతో స్టిక్కర్ వేయడానికి అనుమతి ఇచ్చింది. అయితే పాత ఎంఆర్‌పీ ధర కనిపించాలన్న నిబంధన మేరకు కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. సెప్టెంబరు 22 నుంచి తగ్గించిన ధరలు అందుబాటులోకి వస్తాయని హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) ప్రకటించింది. ఆ ప్రకటన మేరకు నిత్యం వాడే సబ్బులు, షాంపూలు, పేస్టులు, హార్లిక్స్, బూస్ట్ తదితరాల ధరలు గణనీయంగానే తగ్గనున్నాయి. డోవ్ హెయిర్ ఫాల్ రెస్క్యూ షాంపూ 340 ఎంఎల్ ధర రూ.490 నుంచి రూ.435కి తగ్గింది. సన్‌సిల్క్ బ్లాక్ షైన్ షాంపూ 350 ఎంఎల్ ధర రూ.430 నుంచి రూ.370కి తగ్గింది. 75 గ్రాముల డోవ్ సబ్బు రూ.5, లైఫ్‌బాయ్ 75 గ్రాముల సబ్బులు నాలుగింటిపైన కలిపి ఎనిమిది రూపాయలు తగ్గగా అదే ప్యాక్ లక్స్ రేడియంట్ గ్లో సబ్బులపై రూ.11 తగ్గింది. 150 గ్రాముల క్లోజ్‌అప్ టూత్‌పేస్టుపై రూ.16 తగ్గింది. 200 గ్రాముల కిసాన్ జామ్‌పై రూ.10 తగ్గగా... 200 గ్రాముల చాకొలెట్ హార్లిక్స్‌పై రూ.20, 400 గ్రాముల ఉమెన్స్ ప్లస్ హార్లిక్స్‌పై రూ.36, 200 గ్రాముల బూస్ట్‌పై రూ.14, 75 గ్రాముల బ్రూ కాఫీపై రూ.30 తగ్గింది.
ఇవి కూడా చదవండి..
Congress AI Video On PM Mother: మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్
Vijay Statewide Tour: రాజుల తరహాలోనే ప్రజాస్వామ్య యుద్ధానికి ముందు మీ ముందుకొచ్చా
For More National News and Telugu News