Share News

Huge Explosion: భారీ పేలుడు.. ఐదుగురు మహిళలు మృతి, తొమ్మిది మందికి గాయాలు

ABN , Publish Date - Jun 16 , 2025 | 02:56 PM

బాణసంచా కర్మాగారంలో జరిగిన భారీ పేలుడులో ఐదుగురు మహిళలు మృతిచెందగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన, గాయపడ్డ వాళ్లంతా స్థానిక మహిళలే. టపాసులు కడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Huge Explosion: భారీ పేలుడు.. ఐదుగురు మహిళలు మృతి, తొమ్మిది మందికి గాయాలు
Huge Explosion at Firecracker Factory

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర ప్రదేశ్‌లోని బాణసంచా కర్మాగారంలో ఈ(సోమవారం) మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో తొమ్మిది మంది మహిళలకు తీవ్రగాయాలు అయ్యాయి. వీరందరినీ హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు. అటార్సి గ్రామంలోని టపాసుల తయారీ కేంద్రంలో ఈ పేలుడు సంభవించింది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి అత్యవసర సేవలైన అగ్నిమాపక, అంబులెన్స్, పోలీసులు భారీగా చేరుకున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు.


ఈ ఘటనపై రాజబ్‌పూర్ పోలీస్ స్టేషన్ అధికారి మాట్లాడుతూ.. 'ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అటార్సిలోని లైసెన్స్ పొందిన బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, అంబులెన్స్, అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళా కార్మికులు మరణించారు. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాం. మృతదేహాలకు పోస్ట్‌మార్టం జరుగుతోంది. పేలుడు వెనుక గల కారణాన్ని దర్యాప్తు చేస్తున్నాం' అని వెల్లడించారు.


ఇవీ చదవండి:

పాక్ ప్రకటనలు అవాస్తవం.. దసో ఏవియేషన్ స్పష్టీకరణ

భారత్‌ను బలహీనపరిచేందుకు అమెరికా తప్పక ప్రయత్నిస్తుంది.. యూఎస్ ఆర్థికవేత్త హెచ్చరిక

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 16 , 2025 | 04:07 PM