Bengaluru News: ధర్మస్థల పవిత్రతకు భంగం కలిగించరాదు
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:04 PM
పుణ్యక్షేత్రం ధర్మస్థల పవిత్రతతకు భంగం కలిగించే సాగుతున్న కుట్రను అడ్డుకోవాలని కోరుతూ వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సీకల్ రామచంద్రగౌడ మాట్లాడుతూ.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే హిందూదేశంలో హిందువులు పరాయివారువలే బతికే రోజులు ఎంతోదూరం లేదని విచారం వ్యక్తం చేశారు.
బెంగళూరు: పుణ్యక్షేత్రం ధర్మస్థల పవిత్రతతకు భంగం కలిగించే సాగుతున్న కుట్రను అడ్డుకోవాలని కోరుతూ వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బీజేపీ(BJP) జిల్లా అధ్యక్షుడు సీకల్ రామచంద్రగౌడ(Ramachandra Gowda) మాట్లాడుతూ.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే హిందూదేశంలో హిందువులు పరాయివారువలే బతికే రోజులు ఎంతోదూరం లేదని విచారం వ్యక్తం చేశారు. ధర్మస్థల మంజునాథస్వామి ఆలయ పవిత్రతకు భంగం కలిగేలా సాగుతున్న కుట్రను అందరూ అడ్డుకోవాలన్నారు.
కుట్రకు పాల్ప డినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవలికాలంలో హిందూ ధర్మం, ఆలయాల పవిత్రకు భంగం కలిగి కుట్రలు సాగుతున్నాయని వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పట్టణంలో వివిధ హిందూసంఘాల కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. ప్రపంచంలో అన్ని ధర్మాలకు ఎన్నో దేశాలు ఉన్నాయని, హిందువులకు ఉన్నది ఏకైక దేశం భారత్ మాత్రమే అన్నారు.

కాగా ఒక వర్గాన్ని తృప్తి పరిచేందుకు కులాలు, మతాల మధ్య విషబీజాలు నాటేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారన్నారు. రైతు సంఘం, ఒక్కలిగ సంఘం, ధర్మస్థళ సంఘం, ఆటో డ్రైవర్ల సంఘం, పతంజలి యోగ శిక్షణ సమితి, శ్రీరామసేన, తదితర సంఘాలు నిరసనలో పాల్గొన్నాయి. నిరసనలో మాజీ ఎమ్మెల్యే రాజణ్ణ, ఒక్కలిగ సంఘం అధ్యక్షుడు నారా యణస్వామి, బీజేపీ నాయకులు సీకల్ ఆనందగౌడ, కంబదహళ్ళి సురేంద్రగౌడ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి ఉత్తమ్‌కు హరీష్ రావు సంచలన లేఖ
Read Latest Telangana News and National News