Share News

Mumbai Rains: నీటమునిగిన మహానగరం.. 21కి చేరిన మృతుల సంఖ్య

ABN , Publish Date - Aug 20 , 2025 | 09:07 AM

భారీ వర్షాలతో.. ముంబై మహానగరం నీటమునిగింది. వర్షాల కారణంగా విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. విమానాలు, రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రయాణికులకు ఇండిగో అలర్టులు జారీ చేసింది. మరోవైపు ఎయిర్‌పోర్టుకు వచ్చే పలు మార్గాలు నీట మునిగి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Mumbai Rains: నీటమునిగిన మహానగరం.. 21కి చేరిన మృతుల సంఖ్య
Mumbai heavy rains

ముంబై: భారీ వర్షాలకు ఆర్థిక రాజధాని అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా జన జీవనం స్తంభించిపోయింది. ఈ మేరకు భారీ వర్షాల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య మహారాష్ట్రలో 21కి చేరింది. ముంబైతోపాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు అప్రమత్తమయ్యాయి. ముంబై, థానే, పాల్ఘర్‌కు అధికారులు రెడ్ అలర్ట్‌ ప్రకటించారు. ముంబై‌లోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రజలు అవరసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Mumbai-Rain-1.jpg


భారీ వర్షాలతో.. ముంబై మహానగరం నీటమునిగింది. వర్షాల కారణంగా విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. విమానాలు, రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రయాణికులకు ఇండిగో అలర్టులు జారీ చేసింది. మరోవైపు ఎయిర్‌పోర్టుకు వచ్చే పలు మార్గాలు నీట మునిగి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫలితంగా కార్యకలాపాల నిర్వహణలో ఆటంకాలు ఏర్పడి విమాన రాకపోకల్లో జాప్యం జరుగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవన స్తంభించింది. బస్సు, రైలు, విమాన సర్వీసులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. అత్యవసర ప్రభుత్వ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని కూడా నగర పాలక సంస్థ సూచించింది. వర్ష బీభత్సం కారణంగా కాలేజీలు, స్కూళ్లు మూతపడ్డాయి. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రజలు ఎవరూ అవరసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

Mumbai-Rain-2.jpg

Updated Date - Aug 20 , 2025 | 09:08 AM