Heart Disease: గుండె గుభేల్..
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:35 AM
దేశంలో ఇప్పటికీ గుండె, రక్తనాళాల సంబంధిత వ్యాధులతో మరణిస్తున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది...
దేశంలో 31% మరణాలుగుండె సంబంధిత వ్యాధులతోనే
రిజిస్ట్రార్ జనరల్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: దేశంలో ఇప్పటికీ గుండె, రక్తనాళాల సంబంధిత వ్యాధులతో మరణిస్తున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. మొత్తం మరణాల్లో 31ు ఇవే ఉన్నాయి. భారత రిజిస్ట్రార్ జనరల్ ఆధ్వర్యంలో తాజా నమూనా నమోదు సర్వే నివేదిక దీన్ని స్పష్టంచేసింది. 2021-2023 సంవత్సరాల మధ్య మరణ కారణాలపై నివేదిక బుధవారం విడుదలైంది. దీని ప్రకారం దేశంలో అంటువ్యాధులు కాని వ్యాధుల వల్ల సంభవిస్తున్న మరణాల శాతం 56.7గా ఉంది. అంటువ్యాధులు, గర్భిణి సంబంధిత వ్యాధులు, నవజాత శిశువులకు కలిగే ఇబ్బందులు, పౌష్టికాహార లోపం వల్ల సంభవించే మరణాల శాతం 23.4గా ఉంది. 2020-2022 సంవత్సరాలలో కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలో పైన పేర్కొన్న వరుసలో ఈ శాతాల సంఖ్య 55.7, 24.0గా ఉంది. గుండె, రక్తనాళాల సంబంధిత(కార్డియోవాస్కులర్) మరణాల తర్వాత ఊపిరితిత్తుల అంటువ్యాధుల మరణాలు 9.3ు తో 2వ స్థానంలో ఉండగా...తర్వాతి స్థానాల్లో 6.4ుతో క్యాన్సర్ మరణాలు, 5.7ుతో ఊపిరితిత్తుల వ్యాధులున్నాయి. 30ఏళ్లు దాటిన వారిలో జీవనశైలి ప్రధానంగా కార్డియోవాస్కులర్ జబ్బులకు కారణంగా కనిపిస్తోంది. 15-29 మధ్య వయస్సు వారిలో కావాలని తగిలించుకొనే దెబ్బలు, ఆత్మహత్యలు మరణాలకు కారణాలుగా కనిపిస్తున్నాయి. 5.3ు మరణాలు జీర్ణకోశ వ్యాధులతో, 4.9ు మరణాలు జ్వరాల వల్ల, 3.5ు మరణాలు మధుమేహ వ్యాధితో సంభవిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
ఇవి కూడా చదవండి
భారత్‌లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..
భారత్‌ను ముక్కలు చేయాలంటూ పోస్టు.. ఆస్ట్రియా ఆర్థికవేత్త ఎక్స్ అకౌంట్‌పై నిషేధం
For More National News and Telugu News