Chhattisgarh HC: భర్త చేసే బలవంతపు శృంగారం నేరం కాదు ఛత్తీ్‌సగఢ్ హైకోర్టు తీర్పు
ABN , Publish Date - Feb 12 , 2025 | 05:15 AM
భార్య వయసు 18 ఏళ్లలోపు లేకుంటే లైంగిక సంబంధం నెరపేందుకు ఆమె సమ్మతి పొందాల్సిన అవసరం భర్తకు లేదని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ ఆధ్వర్యంలోని ఏకసభ్య ధర్మాసనం నిర్ణయాన్ని ప్రకటించింది. 2017లో ఓ వ్యక్తి భార్య అనుమతి తీసుకోకుండానే ఆమెతో అసహజ లైంగిక సంబంధం నెరిపాడు.

రాయ్‌పూర్, ఫిబ్రవరి 11: భార్యతో భర్త చేసే బలవంతపు శృంగారం, అసహజ లైంగిక చర్యలు నేరాలు కాబోవని ఛత్తీ్‌సగఢ్ హైకోర్టు తీర్పు చెప్పింది. భార్య వయసు 18 ఏళ్లలోపు లేకుంటే లైంగిక సంబంధం నెరపేందుకు ఆమె సమ్మతి పొందాల్సిన అవసరం భర్తకు లేదని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ ఆధ్వర్యంలోని ఏకసభ్య ధర్మాసనం నిర్ణయాన్ని ప్రకటించింది. 2017లో ఓ వ్యక్తి భార్య అనుమతి తీసుకోకుండానే ఆమెతో అసహజ లైంగిక సంబంధం నెరిపాడు. ఆ కారణంగా ఆమె అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. అయినా డాక్టర్లు ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. బలవంతపు శృంగారం కారణంగానే తన ఆరోగ్యం పాడయినట్టు ఆమె మరణ వాంగ్మూలంలో పేర్కొంది. పోస్టుమార్టం చేసిన వైద్యులు కూడా దీన్ని ధ్రువీకరిస్తు నివేదిక ఇచ్చారు. విచారణ జరిపిన ట్రయల్ కోర్టు భర్తకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై నిందితుడు హైకోర్టులో అప్పీలు చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి...పరిస్థితులను గమనిస్తే ఇది రేప్ కిందకు రాదని తెలిపారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రభుత్వానికి రుణ మంజూరు పత్రాలు అందజేసిన హడ్కో ప్రతినిధులు
Also Read: కేటీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే..
Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం
Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి
Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు
Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు
For National News And Telugu News