Haryana ADGP: హర్యానా ఏడీజీపీ ఆత్మహత్య.. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణం!
ABN , Publish Date - Oct 07 , 2025 | 05:13 PM
హర్యానా ఏడీజీపీ వై పురన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. చండీగఢ్‌లోని తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: హర్యానా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) వై. పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. మంగళవారం ఆయన చండీగఢ్‌లోని తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తన ఇంటి బేస్‌మెంట్‌లో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డట్టు సమాచారం. పోలీసు, ఫారెన్సిక్ బృందాలు ఇప్పటికే ఏడీజీపీ ఇంటికి చేరుకున్నాయి. ఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి (Haryana ADGP).
ఘటనకు సంబంధించిన సమాచారం తమకు అందిందని చండీగఢ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కన్వర్‌దీప్ కౌర్ తెలిపారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సెక్టర్ 11 పోలీస్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందిందని చెప్పారు. ‘ఐపీఎస్ అధికారి వై పూరన్ కుమార్ మృత దేహం ఆయన ఇంట్లో లభించింది. సీఎఫ్ఎస్ఎల్ బృందం ఘటనా స్థలానికి వెళ్లింది. దర్యాప్తు ప్రారంభమైంది. పోస్టుమార్టం తరువాత మిగతా విషయాలు తెలుస్తాయి. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు’ అని ఎస్ఎస్‌పీ తెలిపారు.
పూరన్ కుమార్ భార్య.. సీనియర్ ఐఏఎస్ అధికారి అమ్నీత్ పీ కుమార్. ఘటన జరిగిన సమయంలో ఆమె హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలో జపాన్ పర్యటనలో ఉన్నారు. హర్యానా కేడర్‌కు చెందిన పూరన్ కుమార్‌కు మంచి పేరుంది. తన కెరీర్‌లో ఆయన అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి:
దగ్గు మందుతో చిన్నారుల మృతి.. మధ్యప్రదేశ్ వైద్యుడి అరెస్టు
డార్జిలింగ్‌లో కొండచరియల బీభత్సం.. 17 మందికి చేరిన మృతులు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి