Share News

India Counter Response: ఎల్‌వోసీ వెంబడి పాక్‌ కాల్పులు తిప్పికొట్టిన భారత్‌

ABN , Publish Date - Apr 26 , 2025 | 04:20 AM

ఎల్‌వోసీ వెంబడి పాక్‌ కాల్పులకు భారత్‌ గట్టిగా ప్రతిస్పందించింది. పీవోకేలో హమాస్‌ నేతలు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులతో భేటీ అయినట్లు సమాచారం, పహల్గాం దాడిలో హమాస్‌ ముద్ర ఉండొచ్చని ఇజ్రాయెల్‌ రాయబారి అన్నారు

India Counter Response: ఎల్‌వోసీ వెంబడి పాక్‌ కాల్పులు తిప్పికొట్టిన భారత్‌

  • పీవోకేకు హమాస్‌ నేతలు!

  • ఏడాదిగా పలుమార్లు రాకపోకలు

మరోవైపు 2023, అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన దాడికి, తాజాగా పహల్గాంలో ఉగ్రవాదుల మారణకాండకు పోలికలు ఉన్నాయని భారత్‌కు ఇజ్రాయెల్‌ రాయబారి రువెన్‌ అజార్‌ అన్నారు. రెండు ఘటనల్లోనూ సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. ఉగ్రవాద గ్రూపుల మధ్య సమన్వయం పెరుగుతోందని, అన్ని స్థాయిల్లో సహకరించుకుంటున్నారని, ఒకరినొకరు అనుకరిస్తున్నారని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌లో మ్యూజిక్‌ ఫెస్టివల్‌ను జరుపుకుంటున్న వారిపై హమాస్‌ దాడులకు తెగబడినట్లుగానే.. పహల్గాంలో అమాయక పర్యాటకులకు ఉగ్రవాదులు దాడి చేశారన్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో ఇటీవల హమాస్‌ నేతలు పర్యటించారని, అక్కడ జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు తదితరులను కలిసినట్లు తెలిసిందని తెలిపారు. ఆ తర్వాతనే జరిగిన పహల్గాం దాడి అనుమానాలకు తావిస్తోందన్నారు. పహల్గాం ఉగ్రదాడి బాధ్యులైన వారిని వేటాడుతామని ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో పాటు భారత్‌ తీసుకున్న 1960 నాటి సింధూ జలాల ఒప్పందం రద్దు తదితర చర్యలను ప్రశంసించారు.


Bihar: మా నాన్నే మళ్లీ సీఎం, నో డౌట్

Rekha Gupta: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Tahawwur Rana: ప్రతీ రోజు 8 నుంచి 10 గంటల పాటు విచారణ..

BJP: హిమాలయాలకు అన్నామలై.. బాబా గుహలో ధ్యానం

Updated Date - Apr 26 , 2025 | 04:21 AM