Fee Hike Sparks Flight Cancellations: మేము ఇంటికి వెళ్లం బాబోయ్!
ABN , Publish Date - Sep 21 , 2025 | 06:32 AM
హెచ్-1బీ వీసా రుసుము పెంపు పేరిట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేల్చిన బాంబుతో అమెరికాలోని విమానాశ్రయాల్లో శుక్రవారం ఒక్కసారిగా కలకలం రేగింది. చాలామంది తమ ప్రయాణాలను...
స్వదేశానికి ప్రయాణాలను రద్దు చేసుకున్న భారతీయులు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: హెచ్-1బీ వీసా రుసుము పెంపు పేరిట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేల్చిన బాంబుతో అమెరికాలోని విమానాశ్రయాల్లో శుక్రవారం ఒక్కసారిగా కలకలం రేగింది. చాలామంది తమ ప్రయాణాలను అప్పటికప్పుడు రద్దు చేసుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి దసరా, దీపావళి పండుగలు జరుపుకునేందుకు, ఇతర పనుల మీద స్వదేశానికి వచ్చే ప్రణాళికల్లో ఉన్న భారతీయులు కూడా తమ ప్రయాణాలను వెంటనే రద్దు చేసుకున్నారు. మరోపక్క, అమెరికా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన హెచ్-1బీ వీసాదారులు కూడా తిరిగి అమెరికాకు పరుగులు పెడుతున్నారు. హెచ్-1బీ వీసా రుసుము లక్ష డాల్లరకు పెంపు నిర్ణయం సెప్టెంబరు 21 అర్ధరాత్రి తర్వాత నుంచి అమలు కానుండడమే ఇందుకు కారణం. కాగా, శాన్‌ఫ్రాన్సి్‌సకో విమానాశ్రయంలో ఓ ఎమిరేట్స్ విమానంలో ఎక్కి కూర్చున్న ప్రయాణికుల్లో హెచ్-1బీ వీసాదారులు ట్రంప్ ప్రకటన తెలుసుకుని హుటాహుటిన విమానం దిగిపోయారంటూ మసూద్ రాణా అనే వ్యక్తి ఎక్స్‌లో పోస్టు చేశాడు. శాన్‌ఫ్రాన్సి్‌సకో విమానాశ్రయం నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఓ విమానంలో పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయులు తాము విమానం దిగిపోతామంటూ సిబ్బందిని వేడుకోవడం తనను బాధపెట్టిందంటూ మరో వ్యక్తి ఎక్స్‌లో పోస్టు చేశారు. మరోపక్క, భారత్ నుంచి అమెరికాకు నేరుగా వెళ్లే విమాన సర్వీసుల టికెట్ల ధరలు కూడా శనివారం ఒక్కసారిగా పెరిగిపోయాయి. న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లే విమానంలో ఎకనమి క్లాస్ టిక్కెట్ ధర సాధారణ రోజుల్లో అటుఇటుగా రూ.37,000 వరకు ఉంటుంది. కానీ, ట్రంప్ ప్రకటన వెలువడిన రెండు గంటల తర్వాత అదే టిక్కెట్(శనివారం ప్రయాణానికి) ధర రూ.80,000కు పెరిగిపోయింది. శనివారం శంషాబాద్ విమానాశ్రయం అమెరికా ప్రయాణికులు, వారి కుటుంబసభ్యులతో కిక్కిరిసిపోయింది
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు
మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్
Read Latest Telangana News And Telugu News