Gurudwara: గురు గోవింద్ సింగ్ మనల్ని సత్యం, న్యాయం, ధర్మం కోసం నిలబడమన్నారు: ప్రధాని మోదీ
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:28 AM
శ్రీ గురు గోబింద్ సింగ్ జీ మహారాజ్ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మనల్ని సత్యం, న్యాయం, ధర్మం కోసం నిలబడమని, మానవ గౌరవాన్ని కాపాడమని ప్రేరేపించారని... ధైర్యం, కరుణ, త్యాగానికి ప్రతీక..
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 27: శ్రీ గురు గోవింద్ సింగ్ జీ మహారాజ్ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మనల్ని సత్యం, న్యాయం, ధర్మం కోసం నిలబడమని, మానవ గౌరవాన్ని కాపాడమని ప్రేరేపించారని... ధైర్యం, కరుణ, త్యాగానికి ప్రతీక. గురూజీ జీవితం, ఆయన బోధనలు తరతరాలను సేవ, నిస్వార్థ కర్తవ్యం వైపు నడిపిస్తాయని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా.. ఈ ఏడాది, పాట్నాలోని సాహిబ్ తఖ్త్ శ్రీ హరిమందిర్‌ని సందర్శించుకున్న జ్ఞాపకాలను మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అక్కడ గురుజీ, మాతా సాహిబ్ కౌర్ జీ.. పవిత్ర జోరే సాహిబ్ దర్శనం చేసుకున్నట్లు మోదీ తెలిపారు. అప్పటి ఫొటోలను మోదీ తన ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేశారు.
ఇలా ఉండగా, గురు గోవింద్ సింగ్ జన్మదినం పురస్కరించుకుని ఇవాళ దేశంలోని గురుద్వారాలు అందంగా ముస్తాబయ్యాయి. పెద్ద సంఖ్యలో భక్తులు గురుద్వారాలు సందర్శిస్తున్నారు. ఆనంద్ పాఠ్, ప్రభాత్ ఫేరీలతో ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముందు రోజు (డిసెంబర్ 26) వీర్ బాల్ దివస్‌ను జరుపుకున్నారు.
సాహిబ్జాదా జోరావర్ సింగ్, ఫతేహ్ సింగ్‌ల త్యాగాన్ని స్మరించుకుంటూ.. గురు గోవింద్ సింగ్ జీ బోధనలు ఈనాటి సమాజానికి మార్గదర్శకాలు అని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరల్లో 5 రోజులుగా ర్యాలీ! ప్రస్తుత రేట్స్ ఇవీ..
3, 4, 5 తేదీల్లో మూడవ తెలుగు మహాసభలు
Read Latest Telangana News and National News