GST Reduction Boards Mandatory: దుకాణాల్లో జీఎస్టీ తగ్గింపు బోర్డులు తప్పనిసరి
ABN , Publish Date - Sep 15 , 2025 | 06:25 AM
దుకాణాల్లో జీఎస్టీ తగ్గింపు వివరాలకు సంబంధించిన బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్ని రాష్ట్రాలకు ఈ మేరకు...
పన్నుల భారం నుంచి ప్రజలకు ఉపశమనం
350కి పైగా వస్తువుల ధరలు తగ్గుతాయి
రాష్ట్రాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల స్పష్టీకరణ
చెన్నై, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): దుకాణాల్లో జీఎస్టీ తగ్గింపు వివరాలకు సంబంధించిన బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్ని రాష్ట్రాలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా ఈ నెల 22 నుంచి జీఎస్టీ పన్ను తగ్గింపు అమల్లోకి వస్తుందని చెప్పారు. ఆదివారం చెన్నైలో ‘వికసిత్ భారత్ దిశగా పన్నుల సంస్కరణలు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోదీ ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ 350కి పైగా వస్తువుల ధరలు గణనీయంగా తగ్గేలా జీఎస్టీ తగ్గించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని పూర్తి స్థాయిలో అమలయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గతంలో నాలుగు కేటగిరీలు (5, 12, 18, 28)గా విధించిన పన్నులను ప్రస్తుతం రెండు కేటగిరీలకు (5, 18 శాతం) కుదించామని చెప్పారు. దీంతో 140 కోట్లమంది ప్రజలు పన్నుభారం నుంచి ఉపశమనం పొందుతారని వివరించారు.
ఇవి కూడా చదవండి..
అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి