Union Minister Piyush Goyal: జీఎస్టీ తగ్గింపు లబ్ధి కచ్చితంగా ప్రజలకు అందాల్సిందే
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:48 AM
జీఎస్టీ హేతుబద్ధీకరణ ప్రయోజనాలను వినియోగదారులకు పూర్తిగా అందించాల్సిందేనని, ఈ అంశంపై నిఘా పెడతామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్..
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: జీఎస్టీ హేతుబద్ధీకరణ ప్రయోజనాలను వినియోగదారులకు పూర్తిగా అందించాల్సిందేనని, ఈ అంశంపై నిఘా పెడతామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. వివిధ రకాల వస్తువులపై తగ్గిన పన్నుల ప్రకారం వాటి ధరలను తగ్గిస్తామని పరిశ్రమవర్గాలు తనకు హామీ ఇచ్చాయని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై 50ు సుంకాలు విధించడంతోనే మోదీ సర్కారు జీఎస్టీ సంస్కరణల నిర్ణయం తీసుకుందన్న వ్యాఖ్యలను గోయల్ తిరస్కరించారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కార్యదర్శులు, కేంద్ర ఆర్థిక మంత్రి ఏడాదిపాటు సంప్రదింపులు జరిపాక ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఏదో దేశం తీసుకున్న నిర్ణయానికి, జీఎస్టీ హేతుబద్ధీకరణకు సం బంధం లేదన్నారు. కాగా పన్నుల తగ్గింపు ఫలాలు వినియోగదారులకు పూర్తిస్థాయిలో అందాల్సిందేనని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిఘా పెడుతుందని గోయల్ తెలిపారు. రాష్ట్రాలూ తప్పనిసరిగా పర్యవేక్షించాలన్నారు. కాంగ్రెస్‌పాలిత కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు జీఎస్టీమండలి సమావేశంలో అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించాయని, చివరికి ఏకాభిప్రాయంతోనే జీఎస్టీ తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి
భారత్‌లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..
భారత్‌ను ముక్కలు చేయాలంటూ పోస్టు.. ఆస్ట్రియా ఆర్థికవేత్త ఎక్స్ అకౌంట్‌పై నిషేధం
For More National News and Telugu News