GST Rate Cut: జీఎస్‌టీ బొనాంజా షురూ
ABN , Publish Date - Sep 23 , 2025 | 06:56 AM
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఫలితంగా టూత్‌పే్‌స్ట నుంచి కార్ల దాకా 375కు పైగా వస్తువుల ధరలు తగ్గాయి. గతంలో 5, 12, 18, 28 శాతంగా ఉన్న....
అమల్లోకి పన్ను సంస్కరణలు.. 375కు పైగా వస్తువుల ధరల్లో తగ్గుదల
మధ్యతరగతి, సామాన్యులకు ఊరట
శరన్నవరాత్రుల ప్రారంభం, సెలవులతో
పెద్దఎత్తున కొనుగోళ్లు చేపట్టిన ప్రజలు
కిటకిటలాడిన మాల్స్, దుకాణాలు
ఢిల్లీలో మార్కెట్లను సందర్శించిన
కేంద్ర మంత్రులు నిర్మల, నడ్డా, వైష్ణవ్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఫలితంగా టూత్‌పే్‌స్ట నుంచి కార్ల దాకా 375కు పైగా వస్తువుల ధరలు తగ్గాయి. గతంలో 5, 12, 18, 28 శాతంగా ఉన్న పన్ను రేట్లను 5, 18 శాతానికి పరిమితం చేయడంతో దాదాపు 99 శాతం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయి. నిత్యావసర వస్తువుల తయారీ సంస్థలు, కార్ల కంపెనీలు, ఎలకా్ట్రనిక్ వస్తువుల తయారీ సంస్థలు, ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించేశాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపునకు ఈ నెల 3న ఆమోదం తెలిపిన జీఎస్టీ మండలి.. ఈ నెల 22 (సోమవారం) నుంచి తగ్గింపు అమల్లోకి వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కొనుగోళ్లను వాయిదా వేసుకున్న సామాన్యులు.. షాపింగ్ మాళ్ల బాట పట్టారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడం, విద్యా సంస్థలకు దసరా సెలవులు ప్రకటించడంతో కుటంబసభ్యులతో కలిసి కొనుగోళ్లు చేపట్టారు. జీఎస్టీ తగ్గింపును అమలు చేస్తున్నట్లు వినియోగదారులకు తెలిసేలా దుకాణాల్లో పోస్టర్లను అంటించారు. జీఎస్టీ పొదుపు ఉత్సవ ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా, అశ్వినీ వైష్ణవ్ తదితరులు ఢిల్లీలోని వ్యాపార సముదాయాలను సందర్శించారు. జీఎస్టీ సంస్కరణలు క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలవుతున్నాయా? లేదా? అని వినియోగదారులను ఆరా తీశారు. లక్ష్మీనగర్‌లో వ్యాపారులు, సామాన్య ప్రజానీకంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల మాట్లాడారు.
ఆమె ఓ స్టేషనరీ దుకాణానికి వెళ్లారు. జీఎస్టీ తగ్గింపుతో చాలా వస్తువుల ధరలు తగ్గాయని.. విద్యార్థులు, తల్లిదండ్రులకు లబ్ధి చేకూరుతుందని దుకాణ యజమాని కేంద్ర మంత్రితో చెప్పారు. ప్రధాని పిలుపు మేరకు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని సూచించారు. అమర్‌కాలనీలో వ్యాపారులతో సమావేశమైన జేపీ నడ్డా.. జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రజలకు అందేలా చూడాలని కోరారు. స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలను ప్రోత్సహించాలన్నారు. నిత్యావసరాల్లో 99 శాతం వస్తువులపై పన్నులు తగ్గాయని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ప్రభుత్వ అంచనా ప్రకారం ఓ కుటుంబానికి అవసరమైన నిత్యావసరాలు, కిరాణా తదితర బిల్లులు 13 శాతం తగ్గనున్నాయి. కాగా, మధ్యతరగతి వర్గాలు దసరా, దీపావళికి భారీగా కొనుగోళ్లు చేపడతారని.. ఫలితంగా ప్రభుత్వానికి పన్ను రాబడి పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News