Share News

Nikki Bhati Dowry Incident: నిక్కీ భాటి హత్యలో షాకింగ్ నిజాలు.. కొడుకు కళ్ల ముందే..

ABN , Publish Date - Aug 25 , 2025 | 05:15 PM

గ్రేట్​ నోయిడాలో వరకట్నం వేధింపులకు మరో మహిళ అతి దారుణంగా బలైపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కన్న కొడుకు కళ్ల ముందే తన భార్యను..

 Nikki Bhati Dowry Incident:  నిక్కీ భాటి హత్యలో షాకింగ్ నిజాలు.. కొడుకు కళ్ల ముందే..
Nikki Bhati

ఇంటర్నెట్ డెస్క్‌: గ్రేట్​ నోయిడాలో వరకట్నం వేధింపులకు మరో మహిళ అతి దారుణంగా బలైపోయిన సంగతి తెలిసిందే. కన్న కొడుకు కళ్ల ముందే తన భార్య నిక్కీ భాటికు సజీవంగానే నిప్పంటించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పుటికే ఈ కేసులో ఆమె భర్త విపిన్ భాటితో సహా అతడి తండ్రి సత్యవీర్ భాటి, సోదరుడు రోహిత్ భాటి, తల్లి అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనలో సంచలన నిజాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.


అసలేం జరిగింది?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాస్నా పోలీసు స్టేషన్ పరిధిలోని సిర్సా గ్రామంలో నిక్కీ అనే యువతిని 2016 డిసెంబర్‌లో నిక్కీ భాటి (28) ఎలాంటి వరకట్నం తీసుకోకుండానే పెళ్లి చేసుకున్నాడు. అయితే, కొన్నాళ్ల తర్వాత నిక్కీ భర్త, అత్తమామలు ఆమెను వరకట్నం కోసం వేధింపులకు గురిచేశారు. పుట్టింటి నుంచి రూ. 35 లక్షలు తీసుకురావాలని హింసిస్తూ ఉండేవారు. అయితే, ఇలా తన భర్త , అత్తమామలు వరకట్నం కోసం వేధిస్తున్నప్పట్టికీ అన్ని భరిస్తూ వచ్చేది. అయితే, ఈ క్రమంలోనే నిక్కీ.. తన చెల్లితో పాటు తనకు గతంలో ఉండే బ్యూటీ పార్లర్‌ను రీ ఓపెన్ చేయాలని ఇన్‌స్టాగ్రామ్‌లో అందుకు సంబంధించిన రీల్స్ పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకునేది.


నిక్కీతో పాటు తన చెల్లి కాంచన్.. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానెల్‌లలో చాలా చురుగ్గా ఉండేవారు. వాటిని “మేక్ఓవర్ బై కాంచన్” అనే హ్యాండిల్ కింద పార్లర్ కోసం నిర్వహిస్తూ వచ్చారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు ఆదివారం వరకు 54,500 మంది ఫాలోవర్లు ఉన్నారు, కాంచన్ వ్యక్తిగత ఖాతాలో 22,000 మంది ఫాలోవర్లు ఉండగా నిక్కీకి 1,147 మంది ఫాలోవర్లు ఉన్నారు. వారు వీడియోలు, కంటెంట్‌ లకు దాదాపు 2.9 మిలియన్లకు పైగా వ్యూస్ ఉన్నాయి. అయితే, నిక్కీ భర్తకు మాత్రం నిక్కీ ఇలా ఇన్ స్టాలో ఉండటం, రీల్స్ చేయడం అస్సలు నచ్చేది కాదు.


ఈ విషయంపై కూడా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ విషయం మరింత పెద్దదిగా మారి తారా స్థాయికి చేరుకోవడంతో భర్త మరింతగా రగిలిపోయి తన తల్లిదండ్రులతో కలిసి ఆగస్ట్ 21న అతి కిరాతకంగా నిప్పంటించాడు. నిక్కీ వెంటనే కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు హుటాహుటినా ఆమెను ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో ఆమె మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిక్కీ హత్యపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఇదంతా చిన్న వయస్సు ఉన్న నిక్కీ కుమారుడి కళ్ల ముందే జరిగింది. “మమ్మీ మీద ఏదో పోసారు.. ఆ తర్వాత కొట్టారు.. లైటర్​తో నిప్పంటించారు” అని కన్నీళ్లను తుడుచుకుంటూ ఆ చిన్న పిల్లాడు తన తల్లి కోసం ఏడుస్తూ చెప్పాడు. “మీ నాన్నే చంపేశాడా?” అని అడిగినప్పుడు, అవును అంటూ ఆ చిన్న బాలుడు తలూపాడు.

అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిక్కీ భర్తతోపాటు అతడి తల్లిదండ్రులను నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం విపిన్ భాటి కుటుంబం మొత్తం జైల్లో ఊచలు లెక్క పెడుతోంది. అంత క్రూరంగా భార్యను హత్య చేసినా విపిన్‌‌లో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించడం లేదని పోలీసులు తెలిపారు.


Also Read:

బహ్రెయిన్‌లో ఫుడ్ ప్యాకెట్లపై గడువు తేదీల మార్పు.. 19 మంది ప్రవాసీయులకు జైలు శిక్ష..

ప్రధాని విద్యా రికార్డును బహిర్గతం చేయరు: ఢిల్లీ హైకోర్టు తీర్పు

రోజూ ఇయర్‌బడ్స్ వాడితే ఏమవుతుందో తెలుసా?

Updated Date - Aug 25 , 2025 | 05:39 PM