Share News

UttarPradesh: పోలీస్ బదిలీ.. కదిలిన ఊరి జనం

ABN , Publish Date - Apr 18 , 2025 | 04:17 PM

UttarPradesh: రిల్‌పై గబ్బర్ సింగ్ లాంటి పోలీస్ ఉంటే ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. అదే రియల్ లైఫ్‌లో గబ్బర్ సింగ్ లాంటి పోలీస్ ఉంటే.. అలాంటి అధికారికి ప్రజలు బ్రహ్మరథం పడతారు. నిజంగా అదే జరిగింది.

UttarPradesh: పోలీస్ బదిలీ.. కదిలిన ఊరి జనం
Vinod Kumar Singh

డియోరియా, ఏప్రిల్ 18: సినిమాల్లో గబ్బర్ సింగ్ లాంటి పోలీస్ ఆఫీసర్లు నిజ జీవితంలో ఉంటే.. అలాంటి ఆఫీసర్లకు జనం నిజంగా బ్రహ్మరథం పడతారు. అంతుకు ప్రత్యక్ష ఉదాహరణ ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో మదన్‌పూర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఈ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వహిస్తున్న వినోద్ కుమార్ సింగ్‌ను ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసింది.

ఈ విషయం తెలిసిన ఆ ఊరి వాళ్లు.. ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆయన బదిలీపై వెళ్తుంటే.. ఊరి ప్రజలంతా రోడ్లపైకి వచ్చేశారు. ఆయనకు గౌరవ సూచకంగా తల పాగా చుట్టి.. మెడలో పెద్ద పెద్ద దండలు వేసి.. మేళ తాళాలతో ఊరి విధుల్లో ఊరేగించారు. ఈ ఊరేగింపులో గుర్రాలను సైతం వినియోగించారు. ఈ వీడియోలు అటు మీడియాలో.. సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారింది.


గత ఆరు నెల క్రితం మదన్‌పూర్ పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జ్‌గా వినోద్ కుమార్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆ ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చిన వెంటనే ఆయన అక్కడికి చేరుకుని.. ఆ సమస్యను ఇట్టే పరిష్కరించే వారు. ఇక ఆస్టేషన్ పరిధిలో కరడుగట్టిన రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి.. వారితో పరేడ్ సైతం నిర్వహించారు. తోక జాడిస్తే.. కత్తిరిస్తానంటూ వారికి వార్నింగ్ కూడా ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


దీంతో మదన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరధిలో శాంతి భద్రతలు వెల్లువిరిశాయి. ఆ ఊరిలో ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు కుటుంబాల్లోని మహిళలకు ఆయన వివాహం సైతం జరిపించారు. ఒక మహిళ తండ్రి కిడ్నీ సమస్యతో బాధపడుతోంటే.. అయన ఆరోగ్యాన్ని బాగుచేయించడమే కాకుండా.. మహిళకు సైతం వివాహం జరిగేలా చేశారు.


దీంతో పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జ్ వినోద్ కుమార్ సింగ్‌కు ఆ ఊరి వాళ్లంతా తమ కుటుంబ సభ్యుడిగా భావించారు. ఆయన బదిలీపై వెళ్తుంటే.. ఊరి వాళ్లంతా కలత చెందారు. దాంతో ఈ బదిలీలు వృత్తిలో భాగమని వారికి ఆయన నచ్చ చెప్పారు. ఆ క్రమంలో వారంతా ఆయనకు గౌరవ సూచకంగా మేళ తాళాలతో ఊరు నుంచి సాగనంపారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వార్తలు చదవండి..

Kishan Reddy: ఎంఐఎంకు ఆ పార్టీలు జీ హుజూరంటున్నాయి: కిషన్ రెడ్డి

For National News And Telugu News

Updated Date - Apr 18 , 2025 | 05:04 PM