Wife Catches Husband: లవర్‌తో భర్త.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుుకున్న భార్య ఏం చేసిందంటే..
ABN , Publish Date - Sep 21 , 2025 | 01:36 PM
హోటల్‌లో ఉన్న ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో రచ్చ మొదలైంది. భర్త ప్రియురాలిపై ఆమె దాడి చేసింది. భార్య నుంచి తన ప్రియురాలిని రక్షించుకోవడానికి భర్త చాలా ప్రయత్నించాడు.
ప్రియురాలితో కలిసి ఎంజాయ్ చేస్తున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భర్త ప్రియురాలిని నడిరోడ్డులో చావగొట్టింది. దాదాపు 45 నిమిషాల పాటు రోడ్డుపై రచ్చ జరిగింది. పోలీసుల ఎంట్రీతో గానీ గొడవ ఆగలేదు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖజ్నీ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు గోరఖ్‌పుర్‌కు చెందిన వ్యక్తితో మూడేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 1.5 సంవత్సరాల కూతురు ఉంది.
గత కొంతకాలం నుంచి భర్త ప్రవర్తనలో మార్పు రావటం భార్య గుర్తించింది. అతడు ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేవాడు. అతడి వాట్సాప్‌లో అమ్మాయిల ఫొటోలు ఉండటం భార్య చూసింది. భర్త వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడన్న అనుమానం ఆమెలో మొదలైంది. ఇదే విషయాన్ని అత్తింటి వారికి చెప్పింది. వారు నమ్మకపోగా.. ఆమెవి కేవలం ఊహలు మాత్రమే అని కొట్టి పారేశారు. గత కొన్ని రోజుల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి.
శుక్రవారం ఉదయం భర్త ఇంటినుంచి బయటకు వెళ్లాడు. భార్య అతడ్ని ఫాలో అయింది. ఆమె అనుమానం నిజం అయింది. భర్త ఓ అమ్మాయితో హోటల్‌కు వెళ్లాడు. ఆమె వారిని ఫాలో అయింది. హోటల్‌లో ఉన్న ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో రచ్చ మొదలైంది. భర్త ప్రియురాలిపై ఆమె దాడి చేసింది. భార్య నుంచి తన ప్రియురాలిని రక్షించుకోవడానికి భర్త చాలా ప్రయత్నించాడు. దాదాపు 45 నిమిషాల పాటు గొడవ జరిగింది. ఈ గొడవ గురించి పోలీసులకు సమాచారం అందింది.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భర్త, అతడి ప్రియురాలిని అక్కడినుంచి తరలించారు. ఈ సంఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. భార్య తన భర్తపై కేసు పెట్టడానికి నిరాకరించింది. ఎవరైనా కేసు పెడితే దర్యాప్తు చేపడతామని పోలీసులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
కబడ్డీ మ్యాచ్ సందర్భంగా తీవ్ర విషాదం.. ముగ్గురు మృతి..
హైదరాబాద్‌లో బతుకమ్మ పండుగ సంబరాలకు రంగం సిద్ధం..