Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ ఎఫెక్ట్.. ఏయిరో ఇండియా షో మిస్సైన పైలట్‌లు
ABN , Publish Date - Feb 11 , 2025 | 11:24 PM
ఎయిరో ఇండియాషోలో పాల్గొనేందుకు వచ్చిన జర్మన్ పైలట్లు బెంగళూరు నగర ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి షో మిస్సయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు అంటే ముందుగా గుర్తొచ్చేది ట్రాఫిక్ రద్దీ, ఆకాశాన్నంటే ఇళ్ల అద్దెలు. భారతీయులకు వీటి గురించి అవగాహన ఉంటుంది. అయితే, ఇండియాకు తొలిసారిగా వచ్చిన జర్మన్ పైలట్లు బెంగళూరు ట్రాఫిక్ రద్దీ ఎలా ఉంటుందో చవిచూశారు. ఎయిర్‌షోలో పాల్గొనేందుకు వచ్చిన వారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన షోను మిస్సయ్యారు.
గురువారం పార్లమెంటులో కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు!
నగరంలోని యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఎయిర్‌షో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రారంభోత్సవంలో భాగంగా విమాన విన్యాసాలు కూడా ఏర్పాటు చేశారు.
Bihar Poll Prediction: బీహార్ ఎన్నికల్లోనూ సర్‌ప్రైజ్ తప్పదు: ప్రశాంత్ కిశోర్
ఇక షోలో పాల్గొనేందుకు జర్మన్ పైలట్లు ఏ330 విమానంలో నగరానికి వచ్చారు. అక్కడ ఓ హోటల్‌లో దిగిన వారు ప్రైవేటు క్యాబులో ఫిబ్రవరి ఉదయం 8 గంటలకు షో వేదికకు బయలుదేరారు. అయితే, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పోలీసులు పలు ఆంక్షలు, దారి మళ్లింపులు చేశారు. ఈ క్రమంలో వేదిక వరకూ వచ్చిన జర్మన్ పైలట్ల ఆ తరువాత ఎంట్రన్స్ వద్దే వేచి చూడాల్సి వచ్చింది.
వేదిక వరకూ సాఫీగానే వచ్చాము. కానీ ఎంట్రన్స్ వద్దే గంటన్నర పాటు వేచి చూడాల్సి వచ్చింది అని తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ జర్మన్ పైలట్ అన్నారట. అయితే, షోకు వచ్చే డెలిగేట్స్ కోసం ఓ ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఆ మార్గంలో పయనించకుండా వారు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి ఉండొచ్చని తెలిపారు.
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..