Share News

Sri Ramulu: మాజీమంత్రి శ్రీరాములు సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..

ABN , Publish Date - Jul 18 , 2025 | 01:58 PM

రాష్ట్రంలో డ్రగ్స్‌ వాడకం పెరిగిపోయింది, చాలా కళాశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్‌ అందుబాటులో ఉన్నాయి, అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి శ్రీరాములు మండిపడ్డారు. గురువారం నగంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డ్రగ్స్‌ అమ్మకాలలో కాంగ్రెస్‌ పార్టీలో ఉండే మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రయాంకా ఖర్గే కు సన్నిహితుడు ఒకరు ఇటీవల పోలీసులకు దొరికారాన్నరు.

Sri Ramulu: మాజీమంత్రి శ్రీరాములు సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..

- రాష్ట్రంలో మితిమీరిన డ్రగ్స్‌ వినియోగం

- ఆఫీసుల్లో లంచం ఇవ్వనిదే పని జరగడం లేదు

- రాష్ట్రంపై సుర్జేవాలా పెత్తనం ఏమిటో..

- మాజీ మంత్రి శ్రీరాములు

బళ్లారి(బెంగళూరు): రాష్ట్రంలో డ్రగ్స్‌ వాడకం పెరిగిపోయింది, చాలా కళాశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్‌ అందుబాటులో ఉన్నాయి, అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి శ్రీరాములు(Sri Ramulu) మండిపడ్డారు. గురువారం నగంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డ్రగ్స్‌ అమ్మకాలలో కాంగ్రెస్‌ పార్టీలో ఉండే మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రయాంకా ఖర్గే కు సన్నిహితుడు ఒకరు ఇటీవల పోలీసులకు దొరికారాన్నరు. రాష్ట్రంలో డ్రగ్స్‌, గుట్కా, మట్కా, పేకాట, విచ్చల విడిగా జరుగుతున్నాయిని ఆరోపించారు. కళాశాల వద్ద, బహిరంగంగా గంజాయి దొరుకుతుంటే పోలీసులు ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.


కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి సుర్జేవాల కర్నాటక ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశం జరిపి, ఒక నియంతగా వ్యవహరిస్తున్నారు. అసలు ఆయన ఉద్దేశం ఏమిటి..? అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా సిద్దరామయ్య కోమాలో ఉన్నారని విమర్శించారు. బెంగళూరులో జరిగిన ఓబిసీ జాతీయ కమిటీ సమావేశంలో బీహర్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జరిపారన్నారు. బళ్లారి సూపర్‌ స్పెషాల్టీ ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉందని, ఇక్కడ వైద్యులు నియామకం జరపాలని కోరారు.


గాలి జనార్దన్‌రెడ్డితో మనస్పర్థలు లేవు..

జనార్దన్‌రెడ్దితో దూరంగా ఉన్నారు కదా, కలిసే అవకాశం ఉందా అని ప్రశ్నించగా గాలితో తనకు ఎలాంటి మనస్పర్థలు లేవని మంత్రి శ్రీరాములు అన్నారు. ఒక వేళ ఉన్నా ఆయన్ని, తనను కూర్పొబెట్టి అరగ్లాసు వేడి నీరు ఇచ్చి అవితాగే సమయం అంటే కేవలం ఒక నిమిషంలోనే అన్ని సమస్యలు ముగిసిపోతాయన్నారు. ఇద్దరమూ బీజేపీలో ఉన్నామని గుర్తుచేశారు. గాలి కుమారుడు కిరీటిరెడ్డి హీరోగా నటించిన సినిమా చూస్తారా అని అడగ్గా.. తప్పకుండా చూస్తానన్నారు. కిరీటిరెడ్డి తన చేతుల్లో పెరిగాడని బదులిచ్చారు. ఆయనతో పాటు కార్పొరేటర్‌ ఇబ్రహీంబాబు తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం కొనాలనుకునేవారికి షాక్.. మళ్లీ పెరిగిన ధరలు..

బీఆర్‌ఎస్‌ నా దారిలోకి రావాల్సిందే..

Read Latest Telangana News and National News

Updated Date - Jul 18 , 2025 | 01:58 PM