Minister: ఉన్ని జ్వరంపై మాజీ సీఎం అవాస్తవాలు..
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:16 PM
రికక్షియా అనే బాక్టీరియా ద్వారా గ్రామాలు, దట్టమైన అడవి ప్రాంతాల్లో వ్యాపిస్తున్న ఉన్ని జ్వరం(Vunny fever) గురించి ప్రజలను భయభ్రాంతులు చేసేలా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు.

- మంత్రి ఎం.సుబ్రమణ్యం
చెన్నై: రికక్షియా అనే బాక్టీరియా ద్వారా గ్రామాలు, దట్టమైన అడవి ప్రాంతాల్లో వ్యాపిస్తున్న ఉన్ని జ్వరం(Vunny fever) గురించి ప్రజలను భయభ్రాంతులు చేసేలా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Health Minister M. Subramaniam) ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నాసాలై ఓమందూర్ ప్రభుత్వ ఎస్టేట్ ప్రాంగణంలోని తమిళనాడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో రూ.6.60 కోట్లతో ఏర్పాటుచేసిన ఎమ్మారై స్కానర్ పరికరాన్ని శుక్రవారం మంత్రి సుబ్రమణ్యం(Minister Subramaniam) ప్రారంభించారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: చెన్నై సెంట్రల్ వద్ద 27 అంతస్థుల టవర్
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ ఆసుపత్రిలో 11 ఏళ్ల క్రితమే ప్రారంభించిన ఎమ్మారై స్కానర్ మంచి ఫలితాలు ఇస్తోందని, ప్రస్తుతం ఏర్పాటుచేసిన కొత్త పరికరం అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది రోగులను స్కాన్ చేసి సత్వరం వెల్లడించే పరిజ్ఞానం ఉందని తెలిపారు. ఇలాంటి పరికరాలను విల్లుపురం, చెంగల్పట్టు(Villupuram, Chengalpattu) జిల్లా ప్రభుత్వాస్పత్రుల్లో కూడా ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ఆపరేషన్‌కు అవసరమైన పరికరాలు, ఆర్థోపెడిక్ ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలు, ఆధునిక వసతులు కల్పించడం వల్ల ఓమందూర్ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు.
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తమిళనాడు(Tamilnadu)లో 30కి పైగా ప్రభుత్వాసుపత్రుల్లో ఎమ్మారై స్కాన్ సదుపాయం ఉందని తెలిపారు. దంత వైద్యులకు త్వరలోనే నిర్వహించనున్న కౌన్సెలింగ్ పారదర్శకంగా ఉంటుందని, ఇందులో సుమారు 34,000 మంది బదిలీ కానున్నారని తెలిపారు. రికక్షియా అనే బాక్టీరియా ద్వారా కుగ్రామాలు, దట్టమైన చెట్లు పెరిగిన ప్రాంతాలున్న దిండుగల్ జిల్లాలో ఉన్ని జ్వరానికి గురైన 8 మంది బాధితుల్లో నలుగురు కోలుకున్నారని, ఈ జ్వరం గురించి పళనిస్వామి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి సుబ్రమణ్యం ఆరోపించారు.
ఈవార్తను కూడా చదవండి: మా కుమార్తెలా ఏ అమ్మాయీ మోసపోవొద్దు
ఈవార్తను కూడా చదవండి: మేడిగడ్డలో లోపాలను 2019లోనే గుర్తించాం
ఈవార్తను కూడా చదవండి: ఎవుసంపై కేసీఆర్ నజర్
ఈవార్తను కూడా చదవండి: Uttam: హరీశ్‌వి దగుల్బాజీ మాటలు
Read Latest Telangana News and National News