Share News

Chennai: చెన్నై సెంట్రల్‌ వద్ద 27 అంతస్థుల టవర్‌

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:53 AM

చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌(Chennai Central Railway Station) ఎదురుగా ‘సెంట్రల్‌ టవర్‌’ పేరుతో కొత్తగా 27 అంతస్థుల భవనసముదాయం నిర్మించనున్నారు. సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌కు ధీటుగా ఈ టవర్‌ కూడా ల్యాండ్‌ మార్క్‌గా మారనుంది.

Chennai: చెన్నై సెంట్రల్‌ వద్ద 27 అంతస్థుల టవర్‌

- రూ.349.99 కోట్లతో భవన సముదాయం

చెన్నై: చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌(Chennai Central Railway Station) ఎదురుగా ‘సెంట్రల్‌ టవర్‌’ పేరుతో కొత్తగా 27 అంతస్థుల భవనసముదాయం నిర్మించనున్నారు. సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌కు ధీటుగా ఈ టవర్‌ కూడా ల్యాండ్‌ మార్క్‌గా మారనుంది. ఈ భవన నిర్మాణానికి రూ.349.99 కోట్లతో కొత్త ప్రాజెక్టు రూపొందించినట్లు చెన్నై మెట్రో సంస్థ ప్రకటించింది. ఈ పనులను రీనాట్స్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థకు అప్పగించినట్లు వెల్లడించింది.

ఈ వార్తను కూడా చదవండి: Kumbh Mela: సన్యాసినిగా మమతా కులకర్ణి


ఈ మేరకు చెన్నై మెట్రోరైలు సంస్థ, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ (టిడ్కో) సంయుక్తంగా ఏర్పాటు చేసిన చెన్నై మెట్రో(Chennai Metro) ఆస్తుల నిర్వహణ సంస్థ (చెన్నై మెట్రోరైలు అసెట్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌-సీఎంఏఎంఎల్‌) ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతలను రీనాట్స్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థకు అప్పగించినట్లు సీఎంఆర్‌ఎల్‌ అధికారులు తెలిపారు. సీఎంఆర్‌ఎల్‌ చైర్మన్‌ ఎంఏ సిద్ధిక్‌ సమక్షంలో సీఎంఏఎంఎల్‌ డైరెక్టర్‌ డి.అర్జునన్‌, రీనాట్స్‌ ప్రాజెక్ట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌. మనోజ్‌ పూసప్పన్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.


ఈ ప్రాజెక్టు ప్రకారం చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో 27 అంతస్థుల భవనసముదాయం నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతం ప్రముఖ పర్యాటక ప్రదేశంగా దేశవిదేశాల పర్యాటకులను ఆకట్టుకుంటుదని అధికారులు తెలిపారు. 3.5 ఎకరాల్లో ఈ టవర్‌ను నిర్మించనున్నారు. మొదటి రెండు అంతస్థుల్లో 40 మంది అతిథులు బసచేయడానికి వీలుగా హోటల్‌ నడుపనున్నారు. 150 మంది అతిథులకు బార్‌, రెస్టారెంట్‌ కూడా నిర్మిస్తారు.


250 కార్లు, 170 బైకులు నిలిపేలా విశాలమైన పార్కింగ్‌ కూడా ఏర్పాటు చేస్తారు. 1 నుండి 4 అంతస్థుల వరకు షాపులు, ఫుడ్‌కోర్ట్‌లు, మల్టీప్లెక్స్‌లుంటాయి. 5 నుండి 25 అంతస్థుల వరకు వివిధ కార్యాలయాలకు కేటాయించనున్నారు.26, 27 అంతస్థులలో అతిథులకు గదులు, బార్‌తో కూడిన హోటల్‌, హాల్స్‌ ఉంటాయి. ఈ భవనసముదాయ ప్రాంతంలో చెన్నై సెంట్రల్‌ మెట్రోరైల్వేస్టేషన్‌, రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి, పార్క్‌ రైల్వేస్టేషన్‌లను కలిపేలా పొడవైన సొరంగమార్గాన్ని కూడా నిర్మించనున్నట్లు అధికారులు వివరించారు.


ఈవార్తను కూడా చదవండి: మా కుమార్తెలా ఏ అమ్మాయీ మోసపోవొద్దు

ఈవార్తను కూడా చదవండి: మేడిగడ్డలో లోపాలను 2019లోనే గుర్తించాం

ఈవార్తను కూడా చదవండి: ఎవుసంపై కేసీఆర్‌ నజర్‌

ఈవార్తను కూడా చదవండి: Uttam: హరీశ్‌వి దగుల్బాజీ మాటలు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 25 , 2025 | 11:53 AM