Share News

Former CM: తేల్చేసిన మాజీసీఎం.. డీఎంకేతో చేతులు కలిపే ఉద్దేశం లేదు

ABN , Publish Date - Aug 05 , 2025 | 10:22 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా మూడు సార్లు కలిసినంత మాత్రాన తాను డీఎంకేతో పొత్తు కుదుర్చుకోనని మాజీముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం స్పష్టంచేశారు. ఇటీవల నగరంలోని సీఎం స్టాలిన్‌ నివాసానికి ఓపీఎస్‌ రెండుసార్లు వెళ్ళడం సోషల్‌ మీడియాలో చర్చినీయాంశమైంది.

Former CM: తేల్చేసిన మాజీసీఎం.. డీఎంకేతో చేతులు కలిపే ఉద్దేశం లేదు

చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా మూడు సార్లు కలిసినంత మాత్రాన తాను డీఎంకేతో పొత్తు కుదుర్చుకోనని మాజీముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam) స్పష్టంచేశారు. ఇటీవల నగరంలోని సీఎం స్టాలిన్‌ నివాసానికి ఓపీఎస్‌ రెండుసార్లు వెళ్ళడం సోషల్‌ మీడియాలో చర్చినీయాంశమైంది. అంతేకాకుండా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుండి ఓపీఎస్‌ వైదొలగడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.


ఓపీఎస్‌ వైఖరిపై డీఎంకే మిత్రపక్షాలు, బీజేపీ కూటమి పార్టీల నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఓపీఎస్‌ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో డీఎంకే కూటమిలో తమ మద్దతుదారులతో కలిసి చేరే ప్రసక్తేలేదన్నారు. మీడియాలో తన గురించి వస్తున్న కథనాలు అవాస్తవాలన్నారు.


nani1.2.jpg

రాష్ట్రాన్ని సుభీక్షంగా పరిపాలించిన మాజీముఖ్యమంత్రులు ఎంజీఆర్‌, జయలలితల ఆశయాలకు అనుగుణంగా 2026లో అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో డీఎంకే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేలా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. తమిళ సంప్రదాయాన్ని గౌరవించేలా తాను స్టాలిన్‌ మర్యాదపూర్వంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నానని, ఇందులో రాజకీయం ఏదీ లేదని ఓపీఎస్‌ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇది రాజకీయం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం!

బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 05 , 2025 | 10:27 AM