Share News

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటరీ ప్యానల్‌కు విక్రమ్ మిస్రీ వివరణ

ABN , Publish Date - May 19 , 2025 | 08:21 PM

తమ చొరవతోనే భారత్-పాక్ కాల్పుల విరమించుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకోవడాన్ని విక్రమ్ మిస్రీ తోసిపుచ్చారు. ద్వైపాక్షిక స్థాయిలో చర్చలు జరిగిన అనంతరమే మిలటరీ యాక్షన్‌ను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటరీ ప్యానల్‌కు విక్రమ్ మిస్రీ వివరణ

న్యూఢిల్లీ: 'ఆపరేష్ సింధూర్'పై విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) సోమవారంనాడు కలుసుకుని వివరణ ఇచ్చారు. భారత్-పాక్ మధ్య మిలటరీ చర్యలు, తదనంతర పరిణామాలను కమిటీకి తెలియజేశారు. భారత్-పాక్ మధ్య సంఘర్షణ ఎల్లప్పుడూ సంప్రదాయ విధానంలోనే ఉందని, అణుదాడుల గురించి పాక్ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అధ్యక్షతన జరిగిన ఈ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, కాంగ్రెస్ ఎంపీలు రాజీవ్ శుక్లా, దీపేంద్ర హుడా, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి, అరుణ్ గోవిల్ పాల్గొన్నారు.

Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎంపీ పాక్ పర్యటనపై రచ్చ.. రాజీనామాకు సిద్ధమేనన్న సీఎం


తమ చొరవతోనే భారత్-పాక్ కాల్పుల విరమించుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకోవడాన్ని మిస్రీ తోసిపుచ్చారు. ద్వైపాక్షిక స్థాయిలో చర్చలు జరిగిన అనంతరమే మిలటరీ యాక్షన్‌ను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మిస్రీ తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తులు దాడికి ముందు, ఆ తర్వాత పాక్‌తో సమాచారం పంచుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని కూడా ప్యానెల్‌కు ఆయన తెలియజేశారు. ఉగ్రవాదులుగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన పలువురు పాకిస్థాన్ నుంచి నిరతంరం ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నారని, ఇండియాపై బహిరంగంగానే హింసను రెచ్చగొడుతున్నారని, ఇది భద్రతా ఆందోళనకు కారణమవుతోందని వివరించారు.


భారత్-పాక్ మధ్య ఇటీవల జరిగిన పరసర్ప దాడుల్లో చైనా ఫ్లాట్‌ఫాంలను పాక్ ఉపయోగించుకుని ఉండవచ్చా అని ప్యానల్‌లోని సభ్యులు మిస్రీని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదన్నారు. పాకిస్థాన్ ఎయిర్‌‍బేస్‌లను భారత్ సమర్ధవంతంగా టార్గెట్ చేసిందని, పరిమితంగానే ఆపరేషనల్ క్యాపబిలిటీలను ప్రదర్శించిందని చెప్పారు.


పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత సాయుధ బలగాలు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్, పీఓకేలోని 9 ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు జరిపి 100కి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆ క్రమంలోనే మూడు రోజుల పాటు డ్రోన్లు, క్షిపణలతో భారత్‌పై పాక్ దాడులకు దిగడంతో వాటిని సమర్ధవంతంగా బలగాలు తిప్పికొట్టాయి. పాక్‌లోని మిలట్రీ, ఎయిర్ బేస్‌లపై భీకరంగా విరుచుకుపడటంతో బెంబేలెత్తిన దాయాది దేశం కాళ్లబేరానికి వచ్చింది. కాల్పుల విరమణ ప్రతిపాదనతో ముందుకు రావడంతో మే 10న కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఉగ్రవాదాన్ని కఠినంగా ఎదుర్కోవాలనే భారతదేశ సంకల్పాన్ని ప్రపంచ నాయకులకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం 33 ప్రపంచ రాజధానులకు అఖిలపక్ష ప్రతినిధులను పంపేందుకు నిర్ణయించింది.


ఇవీ చదవండి:

Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 10:00 PM