Floods in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో వరదలు 10మంది గల్లంతు
ABN , Publish Date - Sep 17 , 2025 | 06:31 AM
ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తింది. మంగళవారం డెహ్రాడూన్‌లో మేఘవిస్ఫోటం జరిగి, మెరుపు వరదలు వచ్చాయి. దీంతో...
న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తింది. మంగళవారం డెహ్రాడూన్‌లో మేఘవిస్ఫోటం జరిగి, మెరుపు వరదలు వచ్చాయి. దీంతో వికా్‌సనగర్ ప్రాంతంలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది వరదలో కొట్టుకుపోయారు. మరోచోట స్వర్ణ నదికి సమీపంలో వరదల్లో చిక్కుకున్న ఓ చిన్నారిని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కాపాడాయి. భారీ వర్షాలకు డెహ్రాడూన్, ముస్సోరీ మాల్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. సహాయక బృందాలు దాదాపు 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. భారీ వర్షాల వల్ల అన్ని నదులు పొంగి పొర్లుతున్నాయని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ఇళ్లు, ప్రభుత్వ ఆస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు.
ఇవి కూాడా చదవండి..
సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు
డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి