Bengaluru News: బెళగావి ఆసుపత్రిలో నకిలీ నర్సు కలకలం
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:41 PM
బెళగావి మెడికల్ కళాశాల ఆసుపత్రికి అనుబంధంగా ఉండే బిమ్స్ ఆసుపత్రిలో నకిలీ నర్సు సేవలందిస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. రెండు మూడు నెలలుగా నర్సింగ్ విద్యార్థిగా చెప్పు కొని సేవలందిస్తున్నారు. ప్రతిరోజూ నర్సింగ్ యూనిపాంలో ఆసుపత్రికి వచ్చి సర్జికల్ వార్డు, ఓపీడీతోపాటు వివిధ విభాగాలలో తిరుగుతూ రోగులకు చికిత్సలు అందిస్తున్నారు.
బెంగళూరు: బెళగావి(Belagavi) మెడికల్ కళాశాల ఆసుపత్రికి అనుబంధంగా ఉండే బిమ్స్ ఆసుపత్రిలో నకిలీ నర్సు సేవలందిస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. రెండు మూడు నెలలుగా నర్సింగ్ విద్యార్థిగా చెప్పు కొని సేవలందిస్తున్నారు. ప్రతిరోజూ నర్సింగ్ యూనిపాంలో ఆసుపత్రికి వచ్చి సర్జికల్ వార్డు, ఓపీడీతోపాటు వివిధ విభాగాలలో తిరుగుతూ రోగులకు చికిత్సలు అందిస్తున్నారు. అనుమానం వచ్చి ప్రశ్నించిన వారికి బిమ్స్ డైరెక్టర్ సూచన మేరకు పని చేస్తున్నానంటూ బెదరింపు ధోరణిలో వ్యవహరించారు.
ఇలా వార్డులో చికిత్సలు అందిస్తుండగా సెక్యూరిటీ గార్డులు పట్టుకున్నారు. విషయాన్ని ఆసుపత్రి సర్జన్, ఆర్‌ఎంఓలకు సమాచారం ఇచ్చారు. ఆమె కారవారకు చెందిన సనా షేక్‌గా గుర్తించారు. బెళగావి(Belagavi) పట్టణం కుమారస్వామి లే అవుట్‌లో సనా నివసిస్తున్నట్టు గుర్తించారు. దీంతో వెంటనే అదుపులోకి తీసుకుని చర్యలకు బిమ్స్ పాలకమండలి సిద్ధమైంది. బిమ్స్ డైరెక్టర్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి నకిలీ నర్సుపై విచారణ జరపాలని గురువారం ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పదేళ్ల బాలుడికి గుండె పోటు.. తల్లి ఒడిలోనే కన్నుమూత
Read Latest Telangana News and National News