Explision in Coaching Centre: కోచింగ్ సెంటర్‌లో పేలుడు.. ఇద్దరు మృతి
ABN , Publish Date - Oct 04 , 2025 | 06:46 PM
పేలుడు సమాచారంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణం స్పందించారు. ఘటనా స్థలికి వెళ్లి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఫరూఖాబాద్: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ఫరూఖాబాద్‌లో శనివారం నాడు మధ్యాహ్నం భారీ పేలుడు (Explosion) సంభవించింది. ఒక కోచింగ్ సెంటర్ (Coaching Centre)లో జరిగిన పేలుడులో ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. మూడు అగ్నిమాపక శకటాలు, అంబులెన్స్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాయి. క్షతగాత్రులను లోహియా జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. 'ది సన్ క్లాసెస్ లైబ్రరీ' కోచింగ్ సెంటర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో పేలుడు సంభవించింది. పేలుడులో పలువురు పిల్లలు గాయపడ్డారు. ఐదుగురు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా వారిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. పేలుడు ఘటన తెలిసిన వెంటనే భారీగా పోలీసు బలగాలను ఆ ప్రాంతంలో మోహరించారు. పేలుడుకు కారణాలపై విచారణ జరుపుతున్నారు.
సీఎం ఆదేశాలు
పేలుడు సమాచారంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణం స్పందించారు. ఘటనా స్థలికి వెళ్లి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి..
నక్సల్స్‌తో చర్చల్లేవ్.. లొంగిపోండి.. అమిత్‌షా హెచ్చరిక
ఎన్నికల సన్నద్ధతను సమీక్షించిన ఈసీ.. 12 రాజకీయ పార్టీలతో భేటీ
Read Latest Telangana News and National News