Naxal Encounter: కన్హా నేషనల్ పార్కులో ఎన్‌కౌంటర్... నక్సల్ కాల్చివేత
ABN , Publish Date - Mar 10 , 2025 | 06:45 PM
అటవీ ప్రాంతంలో నక్సల్స్ సంచరిస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకున్నారని, ఈ క్రమంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. సుమారు 20 మంది వరకూ నక్సల్స్ ఇందులో పాల్గొన్నట్టు చెప్పారు.
భోపాల్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని కన్హా నేషనల్ పార్కులో మంగళవారంనాడు పోలీసులు, నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సల్ హతమయ్యాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో 18 నుంచి 20 మంది నక్సల్స్ పాల్గొన్నట్టు చెబుతున్నారు.
Ranya Rao: ఇంటరాగేషన్‌లో టార్చర్.. కోర్టులో కంటతడి పెట్టిన రన్యారావు
అటవీ ప్రాంతంలో నక్సల్స్ సంచరిస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకున్నారని, ఈ క్రమంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. సుమారు 20 మంది వరకూ నక్సల్స్ ఇందులో పాల్గొన్నట్టు చెప్పారు. ఒక నక్సల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, నక్సల్స్ మద్దతుదారులు ఇద్దరిని అరెస్టు చేశామని తెలిపారు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు మండ్లా ఎస్‌పీ రజత్ సక్లేచా తెలిపారు.
టైగర్ రిజర్వ్‌గా, టూరిస్ట్ ప్రాంతంగా మంచి పేరున్న కన్హా నేషనల్ పార్కులో ఇటీవల కాలంలో మావోయిస్టుల ఉనికి పెరుగుతోంది. విశాలమైన పార్కు, దట్టమైన అడవులు ఉండటంతో మావోయిస్టులు తలదాచుకునేందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నట్టు చెబుతున్నారు. దీంతో వారిని గాలించి పట్టుకోవడం భద్రతా బలగాలకు ఒక సవాలుగా మారుతోంది. సందర్శకుల భద్రతతో పాటు పార్క్‌లో వన్యప్రాణుల సంరక్షణ అధికారులకు కీలకంగా మారుతోంది. నక్సల్స్ రహిత రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు మఖ్యమంత్రి మోహన్ యాదవ్ చర్యలు తీసుకుంటున్నారు. 2026 నాటికి అన్ని రాష్ట్రాలను నక్సల్స్ బెడద నుంచి విముక్తి చేయాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు, పోలీసులు ముమ్ముర గాలింపులు సాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
MK Stalin: నోరు అదుపులో పెట్టుకోండి... కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై స్టాలిన్
NEP, Language Row: విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం.. డీఎంకేపై ధర్మేంద్ర ప్రధాన్ ఎదురుదాడి
Digvijaya Singh: బీజేపీ కోవర్టులను ఎప్పుడు తప్పిస్తారు?.. రాహుల్‌కు డిగ్గీ ప్రశ్న
Ramdev Baba: అమెరికా 'టారిఫ్ టెర్రరిజం'... రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.