Share News

బాస్‌ను సెలవు అడిగిన 10 నిమిషాలకే ఆగిన ఉద్యోగి గుండె

ABN , Publish Date - Sep 15 , 2025 | 06:18 AM

జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం అనే దానికి నిదర్శనంగా నిలిచే ఘటన ఇది. ‘‘సార్‌.. వెన్ను నొప్పి విపరీతంగా ఉంది. విధులకు హాజరు కాలేను. ఈ రోజు నాకు సెలవు ఇవ్వండి సార్‌’’.. ఉద్యోగాలు...

బాస్‌ను సెలవు అడిగిన 10 నిమిషాలకే ఆగిన ఉద్యోగి గుండె

  • కార్డియాక్‌ అరెస్టుకు గురై 40 ఏళ్ల వ్యక్తి హఠాన్మరణం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 14: జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం అనే దానికి నిదర్శనంగా నిలిచే ఘటన ఇది. ‘‘సార్‌.. వెన్ను నొప్పి విపరీతంగా ఉంది. విధులకు హాజరు కాలేను. ఈ రోజు నాకు సెలవు ఇవ్వండి సార్‌’’.. ఉద్యోగాలు చేసుకునే వాళ్లు అనారోగ్యానికి గురైనప్పుడు ఏదో ఓ సందర్భంలో ఇలాంటి సందేశాన్ని తమ పైఅధికారికి పంపే ఉంటారు. కేవీ అయ్యర్‌ అనే ఓ వ్యక్తికి కూడా శంకర్‌(40) అనే తన సహోద్యోగి నుంచి ఈ సందేశం వచ్చింది. తన బృందంలోని వారికి సెలవులు మంజూరు చేసే అధికారం కలిగిన అయ్యర్‌కు ఇలాంటి సందేశాలు సర్వసాధారణమే అయినా... శంకర్‌ పంపిన మెసేజ్‌ మాత్రం అతనికి కలలో కూడా ఊహించని షాకిచ్చింది. ఎందుకంటే సిక్‌ లీవ్‌ కావాలని మెసేజ్‌ పెట్టిన 10 నిమిషాలకే శంకర్‌ ఈ లోకాన్ని వీడారు. తన పైఅధికారి అయ్యర్‌కు ఉదయం 8:37 గంటలకు మెసేజ్‌ పెట్టిన శంకర్‌.. సరిగ్గా పది నిమిషాల తర్వాత ఉదయం 8:47 గంటలకు కార్డియాక్‌ అరెస్టుకు గురై కన్నుమూశారు. శంకర్‌ మరణ వార్తను ఉదయం 11 గంటలప్పుడు తెలుసుకున్న అయ్యర్‌ తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు లేని శంకర్‌ ఇలా కార్డియాక్‌ అరెస్టుకు గురై హఠాత్తుగా మరణించడంతో.. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం కదా..!! అంటూ అయ్యర్‌ తన ఆవేదనను ఎక్స్‌లో పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి..

అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు

నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 15 , 2025 | 06:18 AM