Chennai: పొలంలో పడిన ‘ఏనుగు బెలూన్’
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:27 AM
పొంగల్ పండుగ సందర్భంగా కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చిపట్టి మైదానంలో రాష్ట్ర పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ బెలూన్ల పండుగలో అపశ్రుతి జరిగింది మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ పోటీలలో ఫ్రాన్స్, బ్రెజిల్, వియత్నాం సహా ఎనిమిది దేశాల నుండి తెప్పించిన ఏనుగు, పులి, ఎలుగుబంటి, ఎద్దు తదితర ఆకారాల పెద్ద పెద్ద బెలూన్లను ఎగురవేశారు.

చెన్నై: పొంగల్ పండుగ(Pongal festival) సందర్భంగా కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చిపట్టి మైదానంలో రాష్ట్ర పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ బెలూన్ల పండుగలో అపశ్రుతి జరిగింది మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ పోటీలలో ఫ్రాన్స్, బ్రెజిల్, వియత్నాం సహా ఎనిమిది దేశాల నుండి తెప్పించిన ఏనుగు, పులి, ఎలుగుబంటి, ఎద్దు తదితర ఆకారాల పెద్ద పెద్ద బెలూన్లను ఎగురవేశారు. ఆ సందర్భంగా ఏనుగు ఆకారంలో ఉన్న బెలూన్ ఎగిరింది. ఇందులో విదేశీ ఆడ, మగ పైలెట్లు, వారితో ఇద్దరు బాలికలు ప్రయాణించారు.
ఈ వార్తను కూడా చదవండి: Former CM: మాజీ సీఎం శపథం.. వచ్చే పండుగ నాటికి డీఎంకే సమాధి
ఆచ్చిపట్టి మైదానం నుండి 3. కి.మీ. వరకు ఆకాశంలో ఎగిరిన తర్వాత కిందకు దింపాలని అనుకున్నారు. అయితే ఉన్నట్టుండి గాలి వేగం అధికం కావటంతో ఆ బెలూను దిశ తప్పి 30 కి.మీ.ల మేర ప్రయాణించి కేరళ రాష్ట్రం(Kerala State) కన్నిమారి ముల్లతట్టు అనే ప్రాంతంలోని పంటపొలంలో దిగింది. అదృష్టవశాత్తూ ఆ బెలూన్‌లో ప్రయాణించిన నలుగురికి ఎలాంటి ప్రాణాపాయం కల గలేదు. స్థానికులు పొలంలో పడిన బెలూన్‌ను చూసేందుకు వచ్చారు. ఆలోగా బెలూన్ ఫెస్టివల్ నిర్వాహకులు ఆ ప్రాంతానికి హుటాహుటిన చేరుకుని బెలూన్‌లో చిక్కుకున్న నలుగురిని వెలికి తీశారు.
ఈవార్తను కూడా చదవండి: యువతిని రక్షించబోయి హత్యకు గురయ్యాడా?!
ఈవార్తను కూడా చదవండి: KTR: అరెస్టు చేస్తారా?
ఈవార్తను కూడా చదవండి: పుప్పాలగూడలో జంట హత్యల కలకలం
ఈవార్తను కూడా చదవండి: పవర్‌ప్లాంటు స్ర్కాప్ కుంభకోణంపై నీలినీడలు !
Read Latest Telangana News and National News