Bihar Voter List Revision Row: ఆర్టికల్ 326 ప్రకారమే ఓటర్ల జాబితా రివిజన్: ఈసీ
ABN , Publish Date - Jul 09 , 2025 | 04:47 PM
ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ అధికారాన్ని ఎన్నికల కమిషన్ కలిగి ఉంటుందని రాజ్యాంగంలోని 324వ అధికరణ చెబుతోంది. 326వ అధికరణ ఓటర్ల రివిజన్ ఎక్సర్‌సైజ్‌తో అడల్ట్ ఇండియన్ సిటిజన్లకు ఓటు హక్కును తప్పనిసరి చేస్తోంది.
న్యూఢిల్లీ: బిహార్‌లో ఎన్నికల జాబితా రివిజన్ (Elecoral Roll Revision) వివాదం ముదురుతుండటంతో ఎన్నికల కమిషన్ (Election Commission) మరోసారి స్పష్టత ఇచ్చింది. బిహార్‌లో ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రత్యేక విస్తృత సమీక్ష చట్టపరంగానే జరుగుతోందని తెలిపింది. తమ వాదనకు బలం చేకూరేలా రాజ్యంగంలోని 326వ నిబంధనకు చెందిన స్నాప్‌షాట్‌ను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేసింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ లిస్ట్‌ను తారుమారు చేసే ప్రయత్నంలో భాగంగానే ప్రత్యేక విస్తృత సమీక్షకు ఈసీ ఆదేశాలిచ్చిందంటూ 'ఇండియా' కూటమి విమర్శలు ఉధృతం చేస్తున్న నేపథ్యంలో ఈసీ తాజా వివరణ ఇచ్చింది.
ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ అధికారాన్ని ఎన్నికల కమిషన్ కలిగి ఉంటుందని రాజ్యాంగంలోని 324వ అధికరణ చెబుతోంది. 326వ అధికరణ ఓటర్ల రివిజన్ ఎక్సర్‌సైజ్‌తో అడల్ట్ ఇండియన్ సిటిజన్లకు ఓటు హక్కును తప్పనిసరి చేస్తోంది. రాజ్యాంగంలోని ఈ నిబంధనలను తు.చ. తప్పకుండా తాము పాటిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
బిహార్‌లో ప్రత్యేక రివిజన్ రెండో దశాబ్దాల క్రితం 2003లో జరిగిందని ఈసీ తెలిపింది. ర్యాపిడ్ అర్బనైజేషన్, పెద్దఎత్తున వలసలు, తొలిసారి ఓటువేసే వారి సంఖ్య పెరగడం, మరణాలను రిపోర్ట్ చేయకపోవడం వంటివి కూడా ఓటర్ రివిజన్‌కు కారణాలని పేర్కొంది. ఎన్నికల కమిషన్ తాజాగా నిబంధనలను సడలిస్తూ కీలక నిర్ణయం సైతం తీసుకుంది. ఓటర్లు తమ దరఖస్తులను సమర్పిస్తే చాలని, ప్రస్తుతం సపోర్టింగ్ డాక్యుమెంట్లు అవసరం లేదని ప్రకటించింది. తద్వారా ఓటర్లకు ఉపశమనం కలిగించింది.
బిహార్‌లో ఎన్నికల జాబితా రివిజన్ ప్రక్రియ జూన్ 25న ప్రారంభమైంది. పబ్లిక్ స్ర్రూటినీ, కరెక్షన్ల కోసం డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్‌ను ఆగస్టు 1న పబ్లిష్ చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 30న తుది ఓటర్ల జాబితా విడుదలవుతుంది. అక్టోబర్-నవంబర్‌లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
ఇవి కూడా చదవండి..
జస్టిస్ వర్మ అభిశంసనపై సంతకాలు షురూ.!
టోల్ ప్లాజా విధ్వంసం.. వీడియో వైరల్
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి