Share News

Toll Plaza Vandalism: టోల్‌ ప్లాజా విధ్వంసం.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 09 , 2025 | 03:12 PM

హైవేపై కనీస వసతులు లేకపోవడంపై తాము చాలాకాలంగా నిరసనలు తెలుపుతున్నామని ఎంఎన్ఎస్ వాషిం జిల్లా ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజు పాటిల్ కిడ్సే తెలిపారు. టోల్ ప్లాజా ఇంకా రెడీ కాలేదని, అయితే టోల్ ఫీస్ వసూలు మొదలుపెట్టేశారని చెప్పారు.

Toll Plaza Vandalism: టోల్‌ ప్లాజా విధ్వంసం.. వీడియో వైరల్

ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) కార్యకర్తలు రెచ్చిపోయి విధ్వంసానికి దిగారు. వాషిం జిల్లాలోని అకోలా-నాందేడ్ హైవేపై ఉన్న టోల్‌ ప్లాజాపై విరుచుకుపడ్డారు. టోల్ బూత్‌ల అద్దాలను ఇనుమ రాడ్లతో పగులగొట్టారు. దీంతో అక్కడి వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్డు పనులు పూర్తికాకుండానే టోల్ ఫీజ్ వసూలు చేస్తున్నారంటూ ఎంఎన్ఎస్ కార్యకర్తలు బుధవారంనాడు ఈ దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.


హైవేపై కనీస వసతులు లేకపోవడంపై తాము చాలాకాలంగా నిరసనలు తెలుపుతున్నామని ఎంఎన్ఎస్ వాషిం జిల్లా ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజు పాటిల్ కిడ్సే తెలిపారు. టోల్ ప్లాజా ఇంకా రెడీ కాలేదని, అయితే టోల్ ఫీస్ వసూలు మొదలుపెట్టేశారని చెప్పారు. పలు మార్లు విజ్ఞాపన పత్రాలు ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యా తీసుకోలేదన్నారు. ఇది ప్రజలను మోసగించడమేనని విమర్శించారు. కనెర్ గావ్‌ను కలుపుతూ హైవే ఉంటుందని, అయితే పనులు అసంపూర్తిగా ఉండగానే అధికారులు వసూళ్లు మొదలెట్టేసారని చెప్పారు.


మరాఠీ అస్తిత్వంపై నిరసనలు.. ఉద్రిక్తత

ముంబై మెట్రో పాలిటన్ ప్రాంతంలో ఎంఎన్ఎస్ రాజకీయ ఉద్రిక్తతల నడుమ వాషిం ఘటన చోటుచేసుకుంది. మీరా-భయాందర్‌లో పలు ప్రాంతాల్లో పోలీసు ఉత్తర్వులను ఉల్లంఘించి ఎంఎన్ఎస్ కార్యకర్తలు, మరాఠీ ఏక్తా సమితి, శివసేన (యూబీటీ) కార్యకర్తలు నిరసన ప్రదర్శనలకు దిగడంతో ఉద్రిక్తతలు తెలెత్తాయి. తొలుత బాలాజీ సర్కిల్ నుంచి మీరా రోడ్ స్టేషన్‌ వరకూ ర్యాలీ తలపెట్టినప్పటీ 144 సెక్షన్ కింద పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే ఉదయం నుంచి సమావేశమైన గ్రూపులు ముందుకు వెళ్లకుండా పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. దీంతో బైఠాయింపు ఆందోళనకు కార్యకర్తలు దిగారు. కాగా, వాషిం, ముంబైలో చోటుచేసుకున్న రెండు పరిణామాలతో ఎంఎన్ఎస్ మరోసారి తన పట్టు నిరూపించుకునేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

డ్రగ్స్ కేసులో నటుడు శ్రీకాంత్, కృష్ణకు బెయిల్

రూ. 5 కోట్ల ఆర్థిక నేరం.. భారత్‌కు మోనికా కపూర్..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 09 , 2025 | 03:59 PM