Mahakumbh Eknath Shinde: మహాకుంభ్‌కు శివసేన టీమ్‌తో షిండే
ABN , Publish Date - Feb 17 , 2025 | 07:27 PM
హిందూ సైద్ధాంతికత విషయంలో ఉద్ధవ్ థాకరే శివసేన, షిండే వర్గం శివసేన మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో షిండే ప్రయాగ్‌రాజ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శివసేన నేత ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) ఈనెల 19న ప్రయోగ్‌రాజ్(Prayagraj) వెళ్తున్నారు. మహాకుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పవిత్రస్నానం ఆచరించనున్నారు. షిండే వర్గం శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఆయన వెంట కుంభమేళాకు వెళుతున్నారు. హిందూ సైద్ధాంతికత విషయంలో ఉద్ధవ్ థాకరే శివసేన, షిండే వర్గం శివసేన మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో షిండే పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఇటీవలనే కుటుంబ సభ్యులతో కలిసి మహాకుంభమేళాలో పాల్గొన్నారు.
Chardham Yatra 2025: చార్‌ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ వివరాలు ఇవే
నాసిక్-త్రయంబకేశ్వర్ కుంభ్ 2027
ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా ఇప్పటికే గ్రాండ్ సక్సెస్ కావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం నాసిక్-త్రయంబకేశ్వర్‌లో 2027లో కుంభమేళా నిర్వహణకు సన్నద్ధమవుతోంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే కలిసి ముందస్తు సన్నాహాలకు అవసరమైన వ్యూహాలపై అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో సలహా సంప్రదింపులు కూడా సాగిస్తున్నారు.
భవిష్యత్ కుంభమేళాలు ఎక్కడంటే..
తదుపరి కుంభమేళా 2027లో నాసిక్-త్రయంబకేశ్వర్‌లో జరుగుతుంది. దాని తర్వాత సింహస్థ కుంభ్ 2028లో ఉజ్జయినిలో ఉంటుంది. 2030లో అర్థ్ కుంభ్ ప్రయోగ్‌రాజ్‌లో జరుగుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Sam Pitroda: చైనా మన శత్రువు కాదు.. శామ్ పిట్రోడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
Earthquake: ఢిల్లీలో భూకంపం... ఒక్కసారిగా కంపించిన భూమి
New Delhi : రైళ్ల పేర్లలో గందరగోళం వల్లే!
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.