Chennai News: ఎడప్పాడే కాబోయే సీఎం..
ABN , Publish Date - Aug 23 , 2025 | 10:45 AM
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 200లకు పైగా నియోజకవర్గాల్లో ఘనవిజయం సాధించి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతారని అన్నాడీఎంకే ఎంజీఆర్ యువజన విభాగ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ పేర్కొన్నారు.
- డాక్టర్ సునీల్
చెన్నై: వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 200లకు పైగా నియోజకవర్గాల్లో ఘనవిజయం సాధించి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappdi Palaniswamy) ముఖ్యమంత్రి అవుతారని అన్నాడీఎంకే ఎంజీఆర్ యువజన విభాగ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ పేర్కొన్నారు. ప్రతి ఏటా తిరుమలకు కాలినడకన వెళ్లే ‘ఉంగలుక్కాగ’ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ సునీల్ ఈసారి ఈపీఎస్ నేతృత్వంలో వచ్చే ఏడాది రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలోకి రావాలన్న కోరికతో శనివారం నగరం నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్లారు.

ఈ సందర్భంగా సునీల్ మీడియాతో మాట్లాడుతూ... ఈపీఎస్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రచార యాత్రకు ప్రజా స్పందన పెరుగుతోందని, వచ్చే ఏడాది ఆయన తప్పకుండా సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News