EPS: రాష్ట్రంలో సంకీర్ణమని అమిత్‌షా చెప్పలేదు..
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:22 AM
రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుందని కేంద్రమంత్రి అమిత్‌షా చెప్పలేదని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి మరోమారు స్పష్టం చేశారు. అన్నాడీఎంకే తరుఫున చేపట్టిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార పయనంలో భాగంగా బుధవారం కడలూరు జిల్లా చిదంబరంలో ఈపీఎస్ రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈపీఎస్
చెన్నై: రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుందని కేంద్రమంత్రి అమిత్‌షా చెప్పలేదని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) మరోమారు స్పష్టం చేశారు. అన్నాడీఎంకే తరుఫున చేపట్టిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార పయనంలో భాగంగా బుధవారం కడలూరు జిల్లా చిదంబరంలో ఈపీఎస్ రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2026లో అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీ, పురచ్చి భారదం- తదితర పార్టీలతో ఏర్పాటైన కూటమికి అన్నాడీఎంకే నాయకత్వం వహిస్తుందని, తమ కూటమిలో ఎలాంటి విభేదాలు లేకుండా విజయమే లక్ష్యంగా ఉందన్నారు. కేంద్రహోం మంత్రి అమిత్‌షా పలు సందర్భాల్లో మాట్లాడుతూ, తమిళనాడులో అన్నాడీఎంకే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుందని చెప్పలేదని, కూటమి మద్దతుతో అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని, ప్రజలు తమను మెజారిటీ సీట్లలో గెలిపిస్తారని ఈపీఎస్ నమ్మకం వ్యక్తం చేశారు.

పీఎంకేలో తండ్రీకొడుకుల మధ్య నెలకొన్న విభేదాలు త్వరలో సర్థుమనుగుతాయని, ఆ పార్టీ తమ కూటమిలోకి వస్తే సాధరంగా ఆహ్వానిస్తామని, అదేవిధంగా మరికొన్ని పార్టీలు కూడా తమ కూటమిలోకి వస్తాయన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రజలనుంచి స్వీకరించిన వినతిపత్రాలు ఏమయ్యాయని ఈపీఎస్ ప్రశ్నించారు.
అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జయలలిత ‘అమ్మ పథకం’ ప్రవేశపెట్టారని, అప్పుడు రెవెన్యూ శాఖ అధికారులు రాష్ట్రంలోని ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించారని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డీఎంకే ఆ పథకాలకు స్టిక్కర్లు అంటించి తమవంటూ ప్రజలను మభ్యపెడుతోందని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోని సీఎం స్టాలిన్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కొత్త పథకాలు తీసుకురావడం హాస్యాస్పదమని ఈపీఎస్ విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
తాటి చెట్టే లేదు.. లక్షల లీటర్ల కల్లా..
Read Latest Telangana News and National News