Share News

Kejriwal: యమునలో విషం కలిపిన ఆధారాలు ఇవ్వండి

ABN , Publish Date - Jan 31 , 2025 | 04:12 AM

యమునా నదిలో బీజేపీ విషం కలిపిందంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలపై ఈసీ మరోమారు కన్నెర్ర చేసింది. హరియాణా బీజేపీ ప్రభుత్వం యమునా నదిలోకి పారిశ్రామిక వ్యర్థాలను వదులుతూఢిల్లీ ప్రజలను హతమార్చాలని చూస్తోందన్న ఆరోపణలపై తగిన సాక్ష్యాధారాలను చూపించాలని ఆదేశించింది.

Kejriwal: యమునలో విషం కలిపిన ఆధారాలు ఇవ్వండి

కేజ్రీవాల్‌ ఆరోపణలపై ఈసీ ఆదేశాలు

న్యూఢిల్లీ, జనవరి30: యమునా నదిలో బీజేపీ విషం కలిపిందంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలపై ఈసీ మరోమారు కన్నెర్ర చేసింది. హరియాణా బీజేపీ ప్రభుత్వం యమునా నదిలోకి పారిశ్రామిక వ్యర్థాలను వదులుతూఢిల్లీ ప్రజలను హతమార్చాలని చూస్తోందన్న ఆరోపణలపై తగిన సాక్ష్యాధారాలను చూపించాలని ఆదేశించింది. ఈరోజు(శుక్రవారం) ఉదయం 11 గంటల్లోపు తగిన సాక్ష్యాధారాలు ఢిల్లీ జల్‌బోర్డ్‌కు చూపించలేని పక్షంలో తగినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు ప్రజారోగ్య సంక్షోభంపై చర్చించాల్సిన బాధ్యతలో భాగంగానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు కేజ్రీవాల్‌ ఇప్పటికే ఈసీకి వివరణ ఇచ్చారు. అయితే వాటితో సంతృప్తి చెందని ఈసీ సాక్ష్యాధారాలు అందజేయాలని ఆదేశించింది. కాగా, ఎన్నికల సంఘం తమను లక్ష్యంగా చేసుకుని పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని కేజ్రీవాల్‌ ఆరోపించారు. రిటైర్‌మెంట్‌ తర్వాత పొందబోయే ప్రయోజనాల కోసమే చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఇలా చేస్తున్నారని ఆరోపించారు.


Also Read: హెలికాప్టర్, విమానం ఢీ.. 28 మృతదేహాలు వెలికితీత

Also Read: నెలల తరబడి ఇంటికి వెళ్లని ఆ ఉద్యోగులు.. రిలీజ్ ఎప్పుడంటే..?

For National News And Telugu News

Updated Date - Jan 31 , 2025 | 04:12 AM