Delhi: ఢిల్లీలో వడగళ్లతో కుంభవృష్టి.. రెడ్ అలర్ట్, పలు విమానాల దారిమళ్లింపు
ABN , Publish Date - May 21 , 2025 | 09:25 PM
రాత్రి 8 గంటల సమయంలో గాలులతో కూడిన వర్షం, ఆ వెంబడే వడగళ్లు పడటంతో పలు ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం తలెత్తింది. 8.30 గంటల ప్రాంతలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది.
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో బుధవారం సాయత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వర్షం, వడగళ్లతో రాజధాని నగరంలో జనజీవనానికి అంతరాయం కలిగింది. అయితే వర్షతాపం నుంచి ప్రజలకు ఒకింత ఉపశమనం కలిగింది. ఐజీఐ విమానాశ్రయం వద్ద రాకపోకలకు అంతరాయం కలుగగా, పలు చోట్ల కూకటివేళ్లతో చెట్టు నేలకూలాయి.
Delhi: పాక్ హైకమిషన్ అధికారిని బహిష్కరించిన భారత్
రాత్రి 8 గంటల సమయంలో గాలులతో కూడిన వర్షం, ఆ వెంబడే వడగళ్లు పడటంతో ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం తలెత్తింది. 8.30 గంటల ప్రాంతలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే కొద్ది గంటల్లో వాతావరణ ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు చేసింది. సఫ్దర్‌గంజ్ ఏరియాలో గంటకు 79 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచగా, సెంట్రల్ ఢిల్లీ గోల్ మార్కెట్, లోడి రోడ్‌లో కూడా వడగండ్లు పడ్డాయి. నొయిడాలో వర్షాలతో కూడిన వడగండ్లు పడ్డాయి.
కాగా, ఢిల్లీలో బలమైన ఈదురు గాలులు, వర్షాలు, వడగండ్ల కారణంగా పలు విమానాల రాకపోకల్లో జాప్యం తెలెత్తింది. కొన్ని విమానాలను దారి మళ్లించారు.
Puja Khedkar: ఆమె డ్రగ్ లార్డా? టెర్రరిస్టా?.. పూజా ఖేడ్కర్‌కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిలు
Sonia andhi-Rahul Gandhi: చిక్కుల్లో సోనియా-రాహుల్.. ఈడీ సంచలన ఆరోపణలు..
Police Encounter: ఎన్‌కౌంటర్‌లో గ్యాంగస్టర్ సభ్యుడికి గాయాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి