Dr. B. Amudha: వాతావరణ పరిశోధన కేంద్రం దక్షిణభారత డీడీజీఎంగా అముద
ABN , Publish Date - Mar 01 , 2025 | 06:05 AM
వాతావరణ పరిశోధన కేంద్రం దక్షిణభారత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మేనేజర్ (డీడీజీఎం)గా డాక్టర్ బి.అముద నియమితులయ్యారు. ప్రస్తుతం డీడీజీఎంగా ఉన్న బాలచంద్రన్ శుక్రవారం ఉద్యోగ విరమణ చేశారు.
కేంద్రానికి నేతృత్వం వహించనున్న తొలి మహిళ
చెన్నై, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): వాతావరణ పరిశోధన కేంద్రం దక్షిణభారత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మేనేజర్ (డీడీజీఎం)గా డాక్టర్ బి.అముద నియమితులయ్యారు. ప్రస్తుతం డీడీజీఎంగా ఉన్న బాలచంద్రన్ శుక్రవారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో శనివారం డాక్టర్ అముద ఉద్యోగ బాధ్యతలు స్వీకరించనున్నారు. 18వ శతాబ్దం చివరిలో చెన్నైలో దక్షిణభారత వాతావరణ పరిశోధనా కేంద్రం ఏర్పాటు కాగా, ఈ కేంద్రానికి నేతృత్వం వహించనున్న తొలి మహిళ డాక్టర్ అముద కావడం విశేషం.
అంతేగాక ఆమె తమిళనాట స్థిరపడిన తెలుగు కుటుంబీకురాలు కావడం మరో విశేషం. హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురం, అమరావతి పరిధిలో ఉన్న వాతావరణ కేంద్రాలన్నీ ఈ మండలం కిందకే వస్తాయి. డాక్టర్ అముద ఈశాన్య రుతుపవన ప్రభావిత వర్షాలపై విస్తృత పరిశోధనలు చేపట్టి డాక్టరేట్ పొందారు. 3 దశాబ్దాలుగా ఆమె వాతావరణశాఖలో సేవలందిస్తున్నారు.