Share News

Rail Journey: రైలు ఆసల్యమైందా.. ఈ బంపర్ ఆఫర్ మీకు తెలుసా..

ABN , Publish Date - Feb 22 , 2025 | 05:25 PM

రైలు ఆలస్యంగా నడిస్తే ప్రయాణీకులకు భారతీయ రైల్వే పూర్తి టికెట్ రుసుమును వాపస్ చేస్తుంది. ఈ విధానానికి కొన్ని నియమ, నిబంధనలను భారతీయ రైల్వే నిర్దేషించింది. ఏ సందర్భంలో టికెట్ రుసుమును వాపస్ పొందొచ్చు.. ఎలాంటి పరిస్థితుల్లో టీడీఆర్ విధానాన్ని ఉపయోగించుకోవాలి.

Rail Journey: రైలు ఆసల్యమైందా.. ఈ బంపర్ ఆఫర్ మీకు తెలుసా..
Indian Railways

రైలు ప్రయాణం ఒక్కోసారి ఆలస్యవుతుంది. ప్రస్తుతం సాంకేతికత పెరగడంతో గతంతో పోలిస్తే రైళ్ల రాకపోకల సమయంలో భారీ తేడా కనిపిస్తోంది. గతంలో గంటలకొద్దీ రైళ్లు ఆలస్యంగా నడిచేవి. ప్రస్తుతం చాలా రైళ్లు నిర్ధిష్ట సమయానికి గమ్యస్థానాలను చేరుకుంటున్నాయి. ఏవైనా పండుగలు లేదా ఉత్సవాల వేళ ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ నడిపితే మాత్రం వాటి రాకపోకల విషయంలో నిర్దిష్ట సమయానికి, గమ్యస్థానానికి వెళ్లే సమయానికి భారీ తేడా ఉండొచ్చు. సాధారణంగా రైలు ఎక్కువ గంటలు ఆలస్యమైతే రైలులో ప్రయాణించే ప్రయాణీకులకు రైల్వేశాఖ కొన్ని సదుపాయాలు కల్పిస్తుంది. రైలు స్టేషన్‌నుంచి బయలుదేరిన తర్వాత గమ్యస్థానం చేరుకోవడానికి ఆలస్యమైతే కొన్ని రైళ్లలో రైల్వేశాఖ ఉచితంగా అల్పాహారం, భోజన సదుపాయం కల్పిస్తుంది. అదే సమయంలో ప్రకృతి వైపరీత్యం లేదా అనుకోని కారణాలతో రైలు ఎక్కువసేపు ఆలస్యమైతే రైల్వేశాఖ ప్రయాణీకులకు భోజన వసతి కల్పిస్తుంది. ప్రీపియం రైళ్లు రాజధాని, శతాబ్ధి, దురంతో ఎక్స్‌ప్రెస్‌లు నిర్దేశిత సమయానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ గంటలు ఆలస్యమైతే రైల్వేశాఖ రిజర్వుడు ప్రయాణీకులకు ఉచిత అల్పాహారం, భోజన వసతి కల్పిస్తుంది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో రైల్వే టికెట్‌కు సంబంధించిన మొత్తం రుసుమును వెనక్కి ఇస్తుంది. అది ఏ సందర్భంలోనో తెలుసుకుందాం.


ఫుల్ పేమెంట్ వాపస్

రైలు ఎక్కువ గంటలు ఆలస్యంగా నడిస్తే కొంతమంది తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటారు. ఆల్రెడీ కన్ఫర్మ్ బెర్త్ లేదా సీటు అయితే క్యాన్సిల్ చేసినా పెద్దగా అమౌంట్ వెనక్కి రాదనే ఉద్దేశంతో కొందరు రైలులో ప్రయాణించకపోయినా తమ టికెట్ క్యాన్సిల్ చేసుకోరు. వాస్తవానికి రైలు మూడు గంటలకు మించి ఆలస్యమైతే.. ప్రయాణీకులు రైలు టికెట్ రద్దు చేసుకుంటే పూర్తి రుసుము వాపస్ చేస్తారు. రైలు ఆసల్యమైనప్పుడు రైలు టికెట్ రద్దు చేసుకోకుండా.. రైలులో ప్రయాణం చేయకపోయినా ఫుల్ పేమెంట్ వాపస్ పొందే అవకాశాన్ని భారతీయ రైల్వే కల్పిస్తోంది. రైలు గమ్యస్థానాన్ని చేరిన తర్వాత 72 గంటల వరకు అంటే మూడురోజుల లోపు టీడీఆర్(TDR) ఫైల్ చేస్తే మొత్తం అమౌంట్‌ను రైల్వే శాఖ వాపస్ చేస్తుంది.


ఏ సమయంలో టీడీఆర్ ఫైల్ చేయ్యొచ్చు..

టీడీఆర్ అంటే టికెట్ డిపాజిట్ రిసీప్ట్.. ప్రయాణీకులకు అసౌకర్యం కలిగినప్పుడు టికెట్ రుసుము వాపస్ పొందేందుకు భారతీయ రైల్వే కల్పిస్తున్న సౌకర్యం టీడీఆర్. రైలు రద్దైనప్పుడు, లేదా రైలును వేరే మార్గంలో దారిమళ్లించినప్పుడు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని టికెట్ రుసుము వాపస్ పొందొచ్చు. రైలు మూడు గంటలకు పైగా ఆలస్యంగా నడిస్తే టీడీఆర్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. రైలులో ప్రయాణీకుడు ప్రయాణిస్తున్న సమయంలో ముందస్తు సమాచారం లేకుండా రైలు మార్గాన్ని దారిమళ్లించినప్పుడు ఈ సదుపాయం ద్వారా టికెట్ రుసుము తిరిగిపొందవచ్చు. మీరు ముందుగా టికెట్ బుక్ చేసుకున్న రైల్వే స్టేషన్‌లో రైలు ఆగకపోయినా, రైలు దారిమళ్లించినా టీడీఆర్ విధానాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ టీడీఆర్ ఆప్షన్ ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసుకునే టికెట్లకు కూడా అందుబాటులో ఉంటుంది. ఐఆర్‌సీటీసీలో బుక్ చేసుకున్న టికెట్లకు ఆన్‌లైన్‌లోనే టీడీఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి:

Srisailam Tunnel: ఒక్కసారిగా కూలిన పైకప్పు.. శ్రీశైలం టన్నెల్‌లో ప్రమాదం

AP Capital: అమరావతి పనుల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Feb 22 , 2025 | 05:25 PM