Share News

Lok Sabha: పన్ను చెల్లింపుదారుల డబ్బు వృధా!

ABN , Publish Date - Feb 12 , 2025 | 04:59 AM

2021 జనాభా లెక్కల ప్రకారం సంస్కృతం మాట్లాడేవారు 73 వేలమంది మాత్రమే ఉన్నారు. ఆర్‌ఎ్‌సఎస్‌ సిద్ధాంతాల కోసం పన్ను చెల్లింపుదారుల డబ్బును ఎందుకు వృథా చేయాలి’ అన్నారు.

Lok Sabha: పన్ను చెల్లింపుదారుల డబ్బు వృధా!

లోక్‌సభలో సంస్కృత అనువాదంపై డీఎంకే ఎంపీ దయానిధి అభ్యంతరం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఆర్‌ఎ్‌సఎస్‌ సిద్ధాంతాల కోసం లోక్‌సభ ప్రొసీడింగ్స్‌ను సంస్కృతంలోకి అనువదించడం ద్వారా పన్ను చెల్లింపుదారుల డబ్బును వృధా చేస్తున్నారని డీఎంకే సభ్యుడు దయానిధిమారన్‌ మంగళవారం అభ్యంతరం తెలిపారు. ‘2021 జనాభా లెక్కల ప్రకారం సంస్కృతం మాట్లాడేవారు 73 వేలమంది మాత్రమే ఉన్నారు. ఆర్‌ఎ్‌సఎస్‌ సిద్ధాంతాల కోసం పన్ను చెల్లింపుదారుల డబ్బును ఎందుకు వృథా చేయాలి’ అన్నారు. దీనిపై లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా అసహనం వ్యక్తం చేశారు. సంస్కృతం భారతదేశ ప్రాథమిక భాష అని తేల్చిచెప్పారు. ‘మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో? ముందుగా తెలుసుకోండి’ అని హితవుపలికారు. సంస్కృతం ఒక్కటే కాదని, గుర్తింపు పొందిన 22 భాషల్లోకి ప్రొసీడింగ్స్‌ను అనువదిస్తున్నట్టు తెలిపారు. కాగా, విభజన రాజకీయాలు చేయడమే వాస్తవంగా పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేయడం అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద ప్రధాన్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఒక భాషను ప్రోత్సహించేందుకు మరో భాషను తక్కువచేసి మాట్లాడాల్సిన అవసరం లేదంటూ దయానిధి మారన్‌కు హితవుపలికారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రభుత్వానికి రుణ మంజూరు పత్రాలు అందజేసిన హడ్కో ప్రతినిధులు

Also Read: కేటీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే..

Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం

Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి

Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు

Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు

For National News And Telugu News

Updated Date - Feb 12 , 2025 | 04:59 AM