Share News

DCM: డీసీఎం ఆసక్తికర కామెంట్స్.. నా కుమారుడిని అడ్వకేట్‌ చేస్తున్నా..

ABN , Publish Date - Aug 16 , 2025 | 11:43 AM

విద్యార్థి దశలో లా కోర్సు చేయాలని భావించానని కానీ చదువుకునేటప్పుడే పార్టీ టిక్కెట్‌ ఇచ్చిందని తన ఆశయం నెరవేర్చుకునేందుకు నా కుమారుడిని అడ్వకేట్‌ చేస్తున్నానని డీసీఎం డీకే శివకుమార్‌ తెలిపారు.

DCM: డీసీఎం ఆసక్తికర కామెంట్స్.. నా కుమారుడిని అడ్వకేట్‌ చేస్తున్నా..

- డీసీఎం డీకే శివకుమార్‌

బెంగళూరు: విద్యార్థి దశలో లా కోర్సు చేయాలని భావించానని కానీ చదువుకునేటప్పుడే పార్టీ టిక్కెట్‌ ఇచ్చిందని తన ఆశయం నెరవేర్చుకునేందుకు నా కుమారుడిని అడ్వకేట్‌ చేస్తున్నానని డీసీఎం డీకే శివకుమార్‌(DCM DK Shivakumar) తెలిపారు. గురువారం కనకపురలో నూతనంగా నిర్మించిన కోర్టు కాంప్లెక్స్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తనకూ రోజూ నోటీసులు వస్తుంటాయని, కనీసం నువ్వైనా అడ్వకేట్‌ కావాలని కుమారుడిని కోరానన్నారు.


pandu1.2.jpg

బెంగళూరు దక్షిణ జిల్లా న్యాయవాదులకు ఎలాంటి సమస్య వచ్చినా సోదరుడిలాగా సహకరిస్తానన్నారు. కనకపురలో 240మంది అడ్వకేట్‌లకు కృతజ్ఞతలు తెలుపుతున్నా అన్నారు. మా తాలూకాలో మీరు ప్రజాసేవ చేస్తున్నారని భావిస్తున్నా అన్నారు. 30ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నా అన్నారు. ఎవరైనా తమ మూలాలను మరవరాదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరింతగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

త్వరలో ఖనిజ రంగంలోకి సింగరేణి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 16 , 2025 | 11:43 AM