DK Shivakumar Apologizes: ఇండీ కూటమి నేతలకు క్షమాపణలు
ABN , Publish Date - Aug 27 , 2025 | 03:04 AM
నమస్తే సదా వత్సలే మాతృభూమి’ అంటూ ఆర్‌ఎ్‌సఎస్ ప్రార్థనా గీతాన్ని శాసనసభలో ఆలపించినందుకు కర్ణాటక..
పరమేశ్వర్‌ను సమర్థించే క్రమంలోనే ఆర్‌ఎ్‌సఎస్ గీతాలాపన: డీకే శివకుమార్
బెంగళూరు, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): ‘నమస్తే సదా వత్సలే మాతృభూమి’ అంటూ ఆర్‌ఎ్‌సఎస్ ప్రార్థనా గీతాన్ని శాసనసభలో ఆలపించినందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ క్షమాపణ చెప్పారు. కాంగ్రెస్ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆయన మంగళవారం స్పందించారు. విధాన సౌధలో మీడియాతో మాట్లాడారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, ఎవరి మనసునూ నొప్పించే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. ఇండియా కూటమి నాయకులకు బాధ కలిగి ఉంటే క్షమాపణలు చెబుతున్నానన్నారు. తాను ఆర్‌ఎ్‌సఎ్‌సను పొగడలేదని, కానీ ప్రత్యర్థుల గురించి తెలుసుకోవడం తన కర్తవ్యమని అన్నారు. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడంపై గత గురువారం శానససభలో మాట్లాడుతున్న సందర్భంలో తమ నాయకుడు పరమేశ్వర్‌ను సమర్థించే క్రమంలో ఆర్‌ఎ్‌సఎస్ ప్రార్థనా గీతాన్ని ఆలపించానని తెలిపారు. తాను పుట్టుకతో కాంగ్రె్‌సవాదినని, చివరి దాకా ఇందులో మార్పు ఉండబోదని శివకుమార్ స్పష్టంచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..
Read Latest Telangana News and National News