Congress: కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు.. ఉత్సవాలకు ఆహ్వానించలేదని..
ABN , Publish Date - Feb 27 , 2025 | 01:31 PM
కోలారు జిల్లా కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. కేజీఎఫ్ ఎమ్మెల్యే రూపకళ శశిధర్, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బైరతి సురేశ్(In-charge Minister Bairati Suresh) తీరుపట్ల మండిపడ్డారు.
- జనపర ఉత్సవాలకు ఆహ్వానించలేదని మంత్రి భైరతి సురేష్‌పై ఎమ్మెల్యే రూపకళ ఆగ్రహం
బెంగళూరు: కోలారు జిల్లా కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. కేజీఎఫ్ ఎమ్మెల్యే రూపకళ శశిధర్, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బైరతి సురేశ్(In-charge Minister Bairati Suresh) తీరుపట్ల మండిపడ్డారు. కోలారులో జరిగిన రాష్ట్రస్థాయి జనపర ఉత్సవానికి బంగారపేట ఎమ్మెల్యే నారాయణస్వామి(Bangarapet MLA Narayanaswamy), ముళబాగిలు ఎమ్మెల్యే సమృద్ధి మంజునాథ్, కేజీఎఫ్ ఎమ్మెల్యే రూపకళలు గైర్హాజరయ్యారు. ఇదే విషయమై బుధవారం ఎమ్మెల్యే రూపకళ మాట్లాడుతూ జనపర ఉత్సవానికి తమకు ఆహ్వానం అందలేదన్నారు. అవసరమైనవారికి ఆహ్వానించి రప్పించుకున్నారన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Dy CM: అసలు విషయం చెప్పేసిన డిప్యూటీ సీఎం.. నా తుదిశ్వాస వరకు..
ప్రభుత్వం మాదే అయితే ఏం ప్రయోజనమని, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రే కాదు జిల్లా అధికారి కూడా అలాగే వ్యవహరిస్తున్నారన్నారని మండిపడ్డారు. నేరుగా మంత్రి బైరతి సురేశ్ తీరును తప్పుబట్టారు. ఇప్పటికే దేవుడు ఆశీర్వదించారని, ఇక మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరన్నారు. బడ్జెట్ నిర్ణయాలలోనూ తమ విశ్వాసం తీసుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. రాజకీయంగా మాట్లాడడం లేదని కానీ డీసీసీ బ్యాంకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రూపు విభేదాలను కొందరు ప్రోత్సహిస్తున్నారన్నారు.

కోచిముల్, డీసీసీ బ్యాంకులను నాశనం చేశారన్నారు. రైతుల విషయంలో ఎవరూ స్పందించరని, మూడేళ్లుగా పాడిరైతుల సమస్యలను ప్రశ్నించేవారు లేరన్నారు. కోలారు జిల్లాలో గ్రూపు విభేదాలు కొత్తవేమీకాకున్నా ఎన్నికలు ముగిశాక బహిరంగంగానే విమర్శలు చేయడం ఇదే ప్రథమం.
నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. దళితులకు కేటాయించిన గ్రాంట్లతో జనపర ఉత్సవం జరిగిందని, కానీ జిల్లాకు చెందిన ముగ్గురు దళిత ఎమ్మెల్యేలను కనీసంగా కూడా చర్చింలేదని, ఇది ఎమ్మెల్యేలకు జరిగిన అవమానం కాదని జిల్లా ఎస్సీ, ఎస్టీ సముదాయానికి జరిగిన అన్యాయమన్నారు. మంత్రి శ్రీమంతుడే కావచ్చునని ఆయనకు పలుకుబడి ఉండవచ్చునని అంతమాత్రాన ఎవరు రాకున్నా కార్యక్రమం జరుపుతానని సవాల్ చేసేలా వ్యవహరించడం సరికాదన్నారు. మంత్రి సలహదారుల మాటలు వింటే పరిస్థితి భిన్నంగా ఉంటుందన్నారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: సీఎంకు సిగ్గనిపించడం లేదా..?
ఈవార్తను కూడా చదవండి: ఉప్పల్ కేవీలో ఖాళీల భర్తీకి మార్చి 4 ఇంటర్వ్యూ
ఈవార్తను కూడా చదవండి: వేం నరేందర్‌రెడ్డికి మండలి లేదా రాజ్యసభ?
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మిస్టరీగా మరణాలు!
Read Latest Telangana News and National News